ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కెనడా పర్యటన నేపథ్యంలో, అక్కడి ఖలిస్థానీ గ్రూపులు (Khalistani groups) తీవ్ర ఆందోళనలకు దిగాయి. ఆల్బర్టా రాష్ట్రంలోని కాల్గరీ నగరంలో ఖలిస్థానీలు భారీ కాన్వాయ్ ర్యాలీ నిర్వహించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మోదీని చంపేయాలి” అంటూ చేసిన నినాదాలు తీవ్ర దుమారం రేపాయి. ఇది భారతదేశపు ప్రధానిని లక్ష్యంగా చేసిన తీవ్ర మౌఖిక దాడిగా భావించబడుతోంది.
దిష్టిబొమ్మకు చెప్పుల దండ
ఆందోళన సమయంలో ఖలిస్థానీ గ్రూపులు మోదీ దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి దానిపై చెప్పుల దండ వేసి అవమానపర్చే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతిచ్చిన ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నిధులు సమకూర్చినట్లు సమాచారం. పన్నూ ఇప్పటికే భారత్‌కు వ్యతిరేకంగా అనేక మార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి.
సిక్కు సంఘాల ఖండన
ఖలిస్థానీ గ్రూపుల ఈ విధమైన చర్యలను పలు ప్రామాణిక సిక్కు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోదీని లక్ష్యంగా చేసిన ఈ రకమైన వ్యాఖ్యలు, ప్రదర్శనలు సిక్కు సంప్రదాయాలకు, సామాజిక శాంతికి విరుద్ధమని అభిప్రాయపడ్డాయి. కెనడా ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా స్పందించి, దేశంలో చట్టవ్యవస్థను కాపాడే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌లు పెరుగుతున్నాయి.
Read Also : Israel-Iran War : యుద్ధంలోకి అమెరికా?