కెన్యా(Kenya) తీరప్రాంతం డయానీ నుంచి మసాయి మారా వైపు బయలుదేరిన చిన్న ప్రయాణికుల విమానం దారుణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించినట్లు మొంబాసా ఎయిర్ సఫారీ సంస్థ ధృవీకరించింది. మసాయి మారా ఆఫ్రికాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కాగా, అక్కడ నేషనల్ సఫారీ పార్క్‌కి వెళ్తున్న ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నారు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 5:30 గంటల సమయంలో విమానం కూలి పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.
Read also: Gaza-Israel: గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు!

మరణించిన వారిలో ఎనిమిది మంది హంగేరీ పౌరులు
మృతుల్లో కెన్యా(Kenya) పైలట్‌తో పాటు పది మంది పర్యాటకులు ఉన్నారని సంస్థ చైర్మన్ జాన్ క్లీవ్ తెలిపారు. వారిలో ఎనిమిది మంది హంగేరీ, ఇద్దరు జర్మనీ పౌరులని ఆయన పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపం లేదా పైలట్ తప్పిదం కారణమా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఇంతకుముందు కూడా జరిగిన ఇలాంటి ఘటన
గత ఆగస్టులో కూడా కెన్యా రాజధాని నైరోబి సమీపంలో మరో తేలికపాటి విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఆ విమానం అమ్రేఫ్ వైద్య స్వచ్ఛంద సంస్థకు చెందినది. ఈ రెండవ ప్రమాదం దేశంలో విమాన భద్రతా ప్రమాణాలపై ఆందోళన కలిగిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: