📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: రెండేళ్ల పాటు ‘కెన్నెడీ సెంటర్’ క్లోజ్ ..కారణాలు ఏమిటి?

Author Icon By Vanipushpa
Updated: February 2, 2026 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని చారిత్రక కట్టడాల రూపురేఖలను మార్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ‘జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ (Kennedy Center) ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ను ఈ ఏడాది జూలై నుంచి రెండు సంవత్సరాల పాటు మూసివేయనున్నట్లు ఆదివారం రోజు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక కళా కేంద్రానికి భారీ మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో, కళాకారుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: India vs pakistan cancelled : భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

రెండేళ్ల పాటు ‘కెన్నెడీ సెంటర్’ క్లోజ్ ..కారణాలు ఏమిటి?

నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం

కెన్నెడీ సెంటర్ ప్రస్తుతం ఆర్థికంగా, నిర్మాణపరంగా చాలా బలహీనపడిందని.. అది ఒక ‘అలిసిపోయిన, విరిగిపోయిన’ కట్టడమని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని, పునరుద్ధరణ తర్వాత దీనిని ప్రపంచ స్థాయి సంగీత, కళా కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దశాబ్దాల నాటి పాత భవనం ఒక అద్భుతమైన కళా కోటగా మారుతుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే భవనం శిథిలావస్థలో ఉందన్న వాదనకు ట్రంప్ గానీ, ఆయన మద్దతుదారుడైన సెంటర్ ప్రెసిడెంట్ రిక్ గ్రెనెల్ గానీ ఎటువంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం.

మండిపడుతున్న కుటుంబ సభ్యులు

1964లో హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ స్మారకార్థం కాంగ్రెస్ దీనిని ఒక ‘సజీవ స్మారక చిహ్నం’గా తీర్చిదిద్దింది. 1971లో ప్రారంభమైన ఈ కేంద్రం అప్పటి నుంచి నిరంతరం కళా ప్రదర్శనలకు వేదికగా ఉంటోంది. అయితే ట్రంప్ దీనిపై తన ముద్ర వేయాలని చూడటంపై కెన్నెడీ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కెన్నెడీ మేనకోడలు కెర్రీ కెన్నెడీ స్పందిస్తూ.. ట్రంప్ పదవీకాలం ముగియగానే ఆయన పేరును తానే స్వయంగా తొలగిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. కేవలం కెన్నెడీ సెంటర్ మాత్రమే కాదు వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత, 400 మిలియన్ డాలర్లతో భారీ బాల్‌రూమ్ నిర్మాణం, ఆర్లింగ్టన్ బ్రిడ్జ్ వద్ద భారీ విజయోత్సవ తోరణం వంటి ప్రాజెక్టులతో ట్రంప్ వాషింగ్టన్ స్వరూపాన్నే మార్చాలని చూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

arts and culture news Kennedy Center closure Kennedy Center updates performance arts shutdown Telugu News Paper Telugu News Today US cultural centers Washington DC news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.