📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: Keir Starmer: భారతీయులను మేం అక్కున చేర్చుకుంటాం

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనకు ఒక ద్వారం మూసుకునిపోతే పదిద్వారాలు తెరచుకుంటాయనేది సత్యదూరం కాదు. అమెరికా హెచ్ 1బి వీసాకు లక్ష డాలర్లకు పెంచడంతో ఆమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో అయోమయం నెలకొంది. ఇక అమెరికాలో బతకడం కష్టం అనే నిర్ణయానికి అనేకులు ఇప్పటికే వచ్చారు. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది.

ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణుల(Digital experts) కోసం వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై చర్చిస్తోంది. ఇటీవల అమెరికా కొత్త హెచ్ 1బి వీసాల ఫీజు లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలు) పెంచింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకోవడం పాధాన్యత సంతరించుకుంది.

వీసా ఖర్చులను పూర్తిగా రద్దు

గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్‘ పేరుతో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ‘ నివేదించింది. ప్రపంచంలోని టాప్ ఐదు యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లు లేదా ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన వారికి వీసా ఖర్చులను పూర్తిగా రద్దు చేయాలని ఈ బృందం ఆలోచిస్తోంది. ప్రస్తుతం యూకే గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి రూ.79వేలు ఖర్చు అవుతుంది. వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది.

యూకే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వినూత్న పథకాలు

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచడానికి, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి ఈ చర్యలు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా హెచ్ 1బీ వీసా ఫీజులను విపరీతంగా పెంచడంతో, భారత్ తో సహా అనేక దేశాల నుంచి ప్రతిభావంతులు యూకేవైపు మొగ్గు చూపుతారని బ్రిటన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2020లో ప్రవేశపెట్టిన గ్లోబల్ టాలెంట్ వీసా(Global Talent Visa,) సైన్స్, ఇంజినీరింగ్, హ్యుమానిటీస్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్వంటి రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులకు యూకేలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది.

కీర్ స్టార్‌మర్ ఎవరు?

బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్.

ఆయన భారతీయుల గురించి ఏమి చెప్పారు?

భారతీయులను సమాజంలో ముఖ్య భాగంగా అక్కున చేర్చుకుంటామన్న మాట చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

British Government Google News in Telugu Indian professionals Indians in UK Keir Starmer Latest News in Telugu Telugu News Today UK Opportunities

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.