బ్రిటన్‌లో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న ఎప్‌స్టీన్ ఫైళ్ల వివాదం ఇప్పుడు నేరుగా ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) పీఠాన్ని కదిలిస్తోంది. లైంగిక నేరాల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న పీటర్ మాండెల్సన్‌ను అమెరికా రాయబారిగా నియమించడంపై స్టార్మర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై ఇప్పటికే స్పందించిన స్టార్మర్.. పీటర్ మాండెల్సన్ తనకు అబద్ధాలు చెప్పి పదవి దక్కించుకున్నాడని కూడా వివరించారు. అయినా వివాదం ముగియకపోవడం, విమర్శలు ఎక్కువవడంతో.. స్టార్మర్ రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే తదుపరి ప్రధానిగా ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న షబానా మహమూద్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె పాకిస్థాన్ సంతతి మహిళ కావడంతో.. అందిరిలోనూ ఆసక్తి మొదైలంది.
Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ఇరకాటంలో స్టార్మర్ ప్రభుత్వం
అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక నేరాలకు పాల్పడి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్లలో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ పేరు కూడా బయటకు వచ్చింది. ఎప్‌స్టీన్ నుంచి మాండెల్సన్ భారీగా నగదు అందుకున్నారని, రహస్య సమాచారాన్ని లీక్ చేశారని అభియోగాలు రావడంతో స్టార్మర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనికి బాధ్యత వహిస్తూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్‌స్వీనీ, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ టిమ్ అలన్ ఇప్పటికే రాజీనామా చేశారు. స్టార్మర్ కూడా వైదొలగాలంటూ సొంత పార్టీలోనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే స్టార్మర్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తనకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి స్నేహం లేదని, కేసుతో తనకు ఏ సంబంధం లేదని చెప్పి పీటర్ మాండెల్సన్ తనకు అబద్ధాలు చెప్పడం వల్లే ఆ పదవిని కట్టబెట్టానని వివరించారు. అయినప్పటికీ ఆయనపై విమర్శలు ఆగడం లేదు. రాజీనామా చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే ఆ తర్వాత ప్రధాని రేసులో షబానా మహమూద్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ హోం మంత్రిగా ఉన్న షబానా మహమూద్.. 1980లో బర్మింగ్‌హమ్‌లో జన్మించారు. అయితే ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే అయినప్పటికీ.. బర్మింగ్‌హమ్‌కు వారు వలస వచ్చారు. ఆ తర్వాతే షబానా పుట్టగా.. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. ఆపై బారిస్టర్‌గా కూడా పని చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: