📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Keerthy Suresh: UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్ 

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అరుదైన గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్‌ (United Nations International Children’s Emergency Fund – UNICEF) భారత విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా ప్రకటించింది.

Read Also: Bomb Threats: సీఎం స్టాలిన్‌ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ

ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం, పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం కీర్తి (Keerthy Suresh) మాట్లాడుతూ.. ‘‘ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియా (UNICEF India) తో చేతులు కలపడం గౌరవంగా ఉంది’’ అని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతానని ఆమె వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

celebrity advocate child rights children welfare Keerthy Suresh latest news Telugu News UNICEF India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.