జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. అమాయకులైన పౌరులు, పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఈ దారుణ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ దాడికి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు నిఘావర్గాలు స్పష్టం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ ప్రజలకు ధైర్యం నింపుతున్నాయి. ఉగ్రవాదాన్ని నిలువునా నశింపజేస్తాం, దేశ భద్రత విషయంలో మేము రుణపడి లేం అంటూ మోదీ చేసిన గర్జన, దేశ ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను కట్టడి చేయడానికి ఇప్పటికే భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు,అధికారులు తగ్గింపు,సార్క్ దేశాల వీసా రద్దు,అటారీ-వాఘా బోర్డర్ మూసివేత, ఎక్స్‌ర్ సైజ్ ఆక్రమన్ తదితర చర్యలు చేపట్టింది.
కేసీఆర్ పాత వ్యాఖ్యలు మళ్ళీ గుర్తొస్తున్నాయి
పాకిస్థాన్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పదేళ్ల క్రితమే ఆయన పాకిస్థాన్ బుద్ధిని గ్రహించారు. ఆ దేశంపై మండిపడుతూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ పాకిస్తాన్ దేశం భౌగోళికంగా, సైన్యం పరంగా మన దేశం కన్నా చాలా చిన్నది కశ్మీర్ లో ఎప్పుడు ఏదో గొడవ పెడతా ఉంటది మనం ఎక్కడ మన సంఖ్య ఎక్కడ రోజూ ఏదో గొడవ చేస్తా ఉంటాది. బోర్డర్‌లో మన సైనికులను చంపించడం క్షమించరానిది. భారత్ తలచుకుంటే పాకిస్థాన్ పని పది నిమిషాల్లో అయిపోతుంది. కానీ కేంద్రం గడగడలాడుతోంది. సదరు దేశానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఇది. కేసీఆర్ అప్పుడే పాకిస్థాన్ నిజమైన స్వరూపాన్ని గుర్తించి కేంద్రాన్ని వేధించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పహల్గాం దాడి తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు, నేతలు, భద్రతా వ్యవస్థలు ఒకే స్వరంతో ప్రతీకార గళం ఎత్తుతున్నాయి. ఉగ్రవాదం పై శాశ్వత పరిష్కారం కావాలి, పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలి అంటూ ప్రతినిత్యం నినాదాలు గుప్పిస్తున్నారు.
Read also: Rahul Gandhi : ఈ ప్రాంతాలను సందర్శించండి అంటూ రాహుల్ కు కేటీఆర్ సూచన