📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Katy Perry : అంతరిక్షాన్ని తాకిన పాప్ సింగర్ కేటీ పెర్రీ!

Author Icon By Divya Vani M
Updated: April 15, 2025 • 7:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా స్టార్ గాయని కేటీ పెర్రీ తన జీవితంలో ఓ ప్రత్యేక ఘనత సాధించారు ఆమె అంతరిక్షపు అంచుల వరకు వెళ్లిన అరుదైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. కేటీతో పాటు ఐదుగురు మహిళలు ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్, సీబీఎస్ యాంకర్ గేల్ కింగ్, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషా బోవీ, శాస్త్రవేత్త అమండా గుయెన్, నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ ఈ మిషన్‌లో ఉన్నారు.ఇది బ్లూ ఆరిజిన్ కంపెనీ నిర్వహించిన 11 నిమిషాల అంతరిక్ష యాత్ర. రాకెట్ ద్వారా వారు భూమి వాతావరణానికి మరింత ఎగువకు చేరుకున్నారు.

Katy Perry అంతరిక్షాన్ని తాకిన పాప్ సింగర్ కేటీ పెర్రీ!

ఇది సాధారణ విమాన ప్రయాణం కాదు ఇది జీవితం మొత్తం గుర్తుండిపోయే అనుభవం.బ్లూ ఆరిజిన్ ద్వారా ఈ స్పేస్ ట్రిప్‌లో పాల్గొనాలనుకునే వారు వారి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారుల వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి.అయితే టికెట్ ధరను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు కానీ ముందస్తు బుకింగ్ కోసం రూ.1.25 కోట్లు డిపాజిట్ అవసరం అంటున్నారు. 2021లో జరిగిన తొలి యాత్రలో సీటు రూ.240 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఇక ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు కొన్ని ప్రత్యేక అథితుల్ని బ్లూ ఆరిజిన్ ఉచితంగా ఆహ్వానిస్తుంది.

‘స్టార్ ట్రెక్’ నటుడు విలియం షాట్నర్, టీవీ వ్యాఖ్యాత మైఖేల్ స్ట్రాహన్ లాంటి వారంతా ఉచితంగా ప్రయాణించారు.ఇది డబ్బుతో మాత్రమే లింక్‌ అయిన విషయం కాదని చెబుతున్నారు. “మీ సామాజిక ప్రభావం, మీరు ఎవరన్నది ముఖ్యమవుతుంది,” అని స్పేస్‌విఐపి సంస్థ సహ వ్యవస్థాపకుడు రోమన్ చెప్తారు.ఈసారి కూడా కొంతమంది ఉచితంగా, మరికొందరు డబ్బు చెల్లించి వెళ్లారని తెలుస్తోంది. కానీ సంస్థ ఈ విషయాల్ని బయటపెట్టలేదు. ఎవరు చెల్లించారో, ఎవరు గెస్ట్‌గా వెళ్లారో వెల్లడించలేదు.అంతరిక్షయాత్ర అంటే కేవలం శాస్త్రీయ ప్రయోగం కాదు. ఇది కలలు నెరవేర్చే అవకాశం. పాప్ సింగర్ కేటీ పెర్రీ వంటి సెలబ్రిటీలు ఇలా ముందడుగు వేయడం యువతకు ప్రేరణ.

Read Also : Stock Market: భారీ దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

Blue Origin space trip Celebrity space travel Female astronauts 2025 Jeff Bezos wife space travel Katy Perry Blue Origin Katy Perry space flight 2025 Katy Perry space journey Lauren Sanchez space flight Space tourism news Women in space

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.