📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్థాన్ (pakistan-India) వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మరో కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియా ట్రూత్​లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్పే ఏమీ లేవని రెండు దేశాల నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఘర్షణ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం
“ఘర్షణతో లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోవచ్చు. మీరు చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సాయం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. మనం కేవలం చర్చించడమే కాదు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందాం. కశ్మీర్‌ విషయంలో పరిష్కారాన్ని కనుక్కోగలిగితే మీతో కలిసి పనిచేస్తాను” అంటూ ట్రూత్‌ లో పోస్ట్ పెట్టారు ట్రంప్.
నిజానికి ట్రంప్ తన తొలి విడత పాలనలో కూడా అప్పుడు కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారు. అప్పటి భారత్, పాకిస్థాన్ ప్రధానుల వద్ద కూడా ప్రస్తావించారు. కానీ అప్పుడు మన దేశం మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరించింది. దీంతో ట్రంప్ ఆ విషయంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మరోసారి ప్రతిపాదించారు.

TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

ఇప్పుడు మరోసారి ప్రతిపాదన
మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయని ట్రంప్‌ (Donald trump) తొలుత ట్రూత్ పోస్టులో ప్రకటించారు. ఆ తర్వాత భారత్‌ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. “శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్‌ డీజీఎంఓ భారత డీజీఎంవోకు కాల్ చేశారు. ఆ తర్వాత కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది” అని విదేశాంగ శాఖ ప్రకటించింది. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవికాలంలో కూడా కశ్మీర్‌ సమస్యపై మూడో పక్షంగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటి భారత ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించింది. అటుపై ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడలేదు.
కానీ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాక్ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి, వాటిని కూల్చేసింది సైన్యం. శ్రీనగర్‌లో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్‌ డ్రోన్లను కూల్చేసింది. డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారతదేశం, పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ప్రసరించాయి. అయితే, పాక్ వైఖరి మరోసారి ప్రశ్నార్థకమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు శాంతికి దోహదం చేస్తాయా? లేక అంతర్గత వ్యవహారాలలో జోక్యంగా భావించబడతాయా అనేది చూస్తే తేలుతుంద

Read Also: Primister Modi : ప్రధాని మోదీ వార్నింగ్‌తో ప్రశాంతంగా గడిచిన రాత్రి ఇదే..!

'Kashmir problem #telugu News Google news Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump's new announcement will be solved'-

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.