Telugu News: Kash Patel: స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

Read Time:  1 min
Kash Patel
Kash Patel
FONT SIZE
GET APP

అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్(Kash Patel) తీరుపై మరోసారి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవల బ్రౌన్(Kash Patel) యూనివర్సి టీలో కాల్పుల ఘటన చోటు చేసుకోగా నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ తో కలిసి ఒక పాడ్ కాస్ట్కు కాష్ హాజరుకావడం తీవ్ర చర్చ జరుగుతోంది. చట్టసభ సభ్యులు, ఎఫ్బీఐ మాజీ ఏజెంట్లు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఎఫ్ బిఐ అత్యవసర బాధ్యతలను కాష్ పటేల్ విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Read Also:Pakistan: నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

గాలింపు సమయంలో ఇదేంపని?

కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ తో కలిసి కన్జర్వేటివ్ పాడ్ కాస్టర్ కేటీ మిల్లర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకవైపు బ్రౌన్స్ యూనివర్సి టీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్ కాస్టర్ లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ కోసం గతంలో కూడా పటేల్ ఎఫ్ బీఐ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

కాలిఫోర్నియా గవన్నర్ గావిన్ న్యూసమ్ ఈ క్లిప్ ను రీపోస్టు చేస్తా.. ‘బ్రౌన్ యూనివర్శిటీలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఇంకా స్వేచ్ఛగా తప్పించుకుని తిరుగుతుంటే ఎఫ్ బీఐ డైరెక్టర్ కు తన స్నేహితురాలితో తిరగడానికి, పాడ్ కాస్ట్ లో పాల్గొనడానికి ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రైవేట్ జెట్ లో ప్రయాణించడానికి సమయం దొరికింది’ అని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.