📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kapil Dev: అన్షుల్ కంబోజ్‌కు అండగా నిలిచిన కపిల్ దేవ్

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియాకు కొత్తగా అరంగేట్రం చేసిన యువ పేసర్ అన్షుల్ కంబోజ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో దిగ్గజ క్రికెటర్, మాజీ వరల్డ్ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) అతనికి మద్దతుగా నిలవడం ప్రత్యేకంగా మారింది. అనుభవం లేని ఆటగాడు తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతుండగా వచ్చిన ఒత్తిడిని అర్థం చేసుకోవాలని, అతనిపై తక్షణమే అసాధారణ ప్రదర్శనల ఆశలు పెట్టుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అన్షుల్ కంబోజ్ తన అరంగేట్రం చేశాడు. సీనియర్ పేసర్లు ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు గాయపడటంతో టీమ్‌లో ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలో అన్షుల్‌ (Anshul Kamboj) కు ఆఖరి నిమిషంలో ఛాన్స్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో అతను 18 ఓవర్లు వేసి 89 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇది చూసి అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పేసింగ్‌లో బలహీనతలు ఉన్నాయంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

అతని బౌలింగ్ యాక్షన్ కూడా

కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో “ఇంతకేనా అన్షుల్” అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.నాలుగో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా కపిల్ దేవ్ అండగా నిలిచాడు. ‘ఒక్కో బౌలర్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాలం మారుతోంది. శరీరాలు సహకరించడం కూడా వేర్వేరుగా ఉంటుంది. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రస్తుతం ఉన్న పేసర్లలో టాప్ ఆటగాడు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా చాలా ప్రత్యేకమైనది. నిలకడగా బంతులేయడం చాలా కష్టం. అతను ఇంత కాలం ఆడుతాడని కూడా అనుకోలేదు. ఇప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. విలక్షణమైన బౌలింగ్ శైలితో ఇన్నాళ్లు కొనసాగడమే గొప్ప. జస్‌ప్రీత్ బుమ్రాకు హ్యాట్సాఫ్’అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది.

Kapil Dev: అన్షుల్ కంబోజ్‌కు అండగా నిలిచిన కపిల్ దేవ్

స్లిప్ క్యాచ్‌గా

శనివారం ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్‌‌గా వెనుదిరిగారు. క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్‌లోనే ఈ ఇద్దర్నీ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్‌మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు 544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌటైంది.

కపిల్ దేవ్ నికర విలువ ఎంత?

1983 ప్రపంచ కప్ గెలిచిన భారత కెప్టెన్ నికర విలువ 2025 నాటికి దాదాపు రూ.252 కోట్లు ($30 మిలియన్లు) . అతను వ్యాఖ్యాత మరియు మెంటర్‌షిప్ ద్వారా ఏటా రూ.12 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.

కపిల్ దేవ్ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నాడా?

స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి క్రికెటర్ కపిల్ దేవ్.

Read hindi news: hindi.vaartha.com

Read also: BCCI: బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్..కారణమిదే?

anshul kamboj criticism Anshul Kamboj debut Breaking News debut match pressure India vs England Test Indian Cricket News kapil dev reaction kapil dev supports kamboj latest news team india new pacer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.