📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!

Author Icon By Shobha Rani
Updated: June 4, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లోని 18వ శతాబ్దానికి చెందిన కాంటాజీ దేవాలయం(Kantaji Temple), ఇటీవల విడుదలైన కొత్త 20 టాకా నోటుపై ముద్రించబడింది. ఈ నిర్ణయం చారిత్రకంగా, మతపరంగా, మరియు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనడానికి సంకేతంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ జాతిపిత, అవామీ లీగ్ సహ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ వారసత్వం, జ్ఞాపకాల నుంచి దేశాన్ని దూరం జరిపే ప్రయత్నాల్లో భాగంగా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రపటాన్ని తొలగిస్తోంది. దీని స్థానంలో చారిత్రక కట్టడాలు, మతపరమైన ప్రదేశాల చిత్రాలను ముద్రిస్తున్నారు. ఈ క్రమంలో, వివాదాలు, ఉగ్రదాడులను ఎదుర్కొన్న 18వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం చిత్రం ఇప్పుడు బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 1న బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ అయిన ‘బంగ్లా బ్యాంక్’ కొత్త 20 టాకా నోటును విడుదల చేసింది. ఈ నోటుకు ఒకవైపు దిన్‌జ్‌పూర్‌లోని చారిత్రక కాంటాజీ హిందూ ఆలయ చిత్రాన్ని ముద్రించారు. మరోవైపు, నవగావ్ జిల్లాలోని పహార్‌పూర్ బౌద్ధారామం చిత్రం ఉంది. ఈ బౌద్ధారామం 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్ జాతీయ పుష్పమైన కలువ పువ్వు (ఆకు, మొగ్గతో సహా)ను ముద్రించారు.

Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!

కరెన్సీ నోటుపై ముద్రణ
కొత్త 20 టాకా నోటుపై స్థానం సంపాదించుకున్న కాంటాజీ ఆలయాన్ని కాంటాజీ టెంపుల్ లేదా కాంటానగర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి రూపమైన కాంటాజీ పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చిందని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ (యుఎన్‌బి) నివేదిక పేర్కొంది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు, ఆయన దేవేరి రుక్మిణికి అంకితం చేసినట్టు చెబుతారు. దిన్‌జ్‌పూర్ మహారాజా ప్రాణ్‌నాథ్ 1704లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన కుమారుడు మహారాజా రామ్‌నాథ్ 1752లో పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన అవిభక్త బెంగాల్ ప్రాంతంలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కాంటాజీ ఆలయం గతంలో తీవ్రవాదుల దాడికి గురైంది. డిసెంబర్ 2015లో రాస్ మేళా ఉత్సవాల సమయంలో న్యూ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదులు మూడు బాంబులు విసిరారని 2017 నాటి ఢాకా ట్రిబ్యూన్ కథనం వెల్లడించింది. ఈ జేఎంబీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థగా పనిచేస్తూ, భారత్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో నిషేధానికి గురైంది. దాడి తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అయితే, ఈ దాడికి మాత్రం జేఎంబీ బాధ్యత వహించలేదు. ఇదిలా ఉండగా, మార్చి 2024లో (అప్పటి హసీనా ప్రభుత్వ హయాంలో) కాంటాజీ ఆలయ స్థలంలో ఒక మసీదు నిర్మాణ పనులు ప్రారంభం కావడం స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దిన్‌జ్‌పూర్-1 నియోజకవర్గ ఎంపీ ఎండి జకారియా జకా ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే, గతేడాది సెప్టెంబర్‌లో యూనస్ ప్రభుత్వ మత వ్యవహారాల సలహాదారు ఏఎఫ్ఎం ఖలీద్ హొస్సేన్ ఈ వివాదంపై స్పందిస్తూ “మసీదు పక్కన ప్రభుత్వ భూమి ఉంది. ఆ లీజు భూమిలో మసీదు విస్తరణ జరగనివ్వండి. ఆలయ ఆస్తి ఆలయానికే ఉండాలి” అని వ్యాఖ్యానించారు. కరెన్సీ నోటుపై ఈ ఆలయ చిత్రాన్ని ముద్రించడం, దేశంలో మతపరమైన సమరసతపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అంతకుముందు, 2002లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాత్-ఎ-ఇస్లామీ బంగ్లాదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత విడుదల చేసిన 20 టాకా నోటుకు ఇరువైపులా ఛోటో సోనా మసీదు చిత్రం ఉండేది. 2012 మార్పులో ఈ మసీదు చిత్రం నోటు వెనుక భాగానికి మారింది.

Read Also: America: యూఎస్ కు ‘విపత్తుల ఫంగస్‌’ అక్రమ రవాణా

Breaking News in Telugu currency note! Google news Google News in Telugu Kantaji temple on Bangladesh Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.