📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

Author Icon By Aanusha
Updated: March 7, 2026 • 10:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kamal Haasan-Trump: మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, నటుడు కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక స్వతంత్ర దేశంగా భారత్ తన నిర్ణయాలను తానే తీసుకుంటుందని, విదేశీ శక్తుల ప్రభావం తమపై ఉండదని ఆయన స్పష్టం చేశారు.”మిస్టర్ ప్రెసిడెంట్.. మేం (భారతీయులు) స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశానికి చెందిన ప్రజలం. సుదూర తీరాల నుంచి వచ్చే ఆదేశాలను స్వీకరించే రోజులు ఎప్పుడో పోయాయి.

Read Also: Dubai gold price : దుబాయ్‌లో చవకగా బంగారం, యుద్ధమే అసలు కారణమా?

మీ సామర్థ్యం మేరకు మీ పనేదో మీరు చూసుకుంటే మంచిది (Mind your own business)” అంటూ కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడికి ఘాటుగా సూచించారు. దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని ఆయన హితవు పలికారు. అది మాత్రమే శాశ్వత ప్రపంచ శాంతికి ఏకైక పునాది అని ఆయన పేర్కొన్నారు.

Kamal Haasan’s counter to Trump

“మీ పనేదో మీరు చూసుకోండి”: కమల్ ఘాటు లేఖ

అయితే, చివరగా అమెరికా దేశానికి, అక్కడి ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. “ఒక గర్వించదగ్గ భారతీయ పౌరుడు” అంటూ ఈ లేఖను కమల్ హాసన్ ముగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని కమల్ హాసన్ తన లేఖ ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్ కు 30 రోజుల పాటు అనుమతి ఇస్తున్నామని అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో, కమల్ హాసన్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump India sovereignty Kamal Haasan Makkal Needhi Maiam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.