📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ – ఓ కొత్త అధ్యాయం షురూ

Author Icon By Shobha Rani
Updated: May 28, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల సమ‌యంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఎంఎన్‌ఎంకు రాజ్య‌స‌భ సీటు కేటాయించారు. ఇందులో భాగంగా కమల్ హాసన్ (Kamal Haasan) అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో ఈ స్థాయిలో డీఎంకేకు 134 మంది శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డీఎంకేకు, మిగిలిన రెండు అన్నాడీఎంకేకు దక్కే అవకాశాలు ఏన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం డీఎంకే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ కూడా ఉన్నారు. కమల్ హాసన్ సామాజిక, సాంస్కృతిక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగినవారు. రాజ్యసభ వేదికగా ఆయన పరిశీలనాత్మక ప్రసంగాలు, వాస్తవిక దృష్టికోణం రాజకీయ చర్చలకు కొత్త ప్రేరణనిచ్చే అవకాశముంది.మిగిలిన ముగ్గురు అభ్యర్థులు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విల్సన్, ప్రఖ్యాత రచయిత సల్మా, ఎస్.ఆర్. శివలింగం.దీంతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పవచ్చు.

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ – ఓ కొత్త అధ్యాయం షురూ

డీఎంకే ప్రకటించిన అభ్యర్థుల జాబితా
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ (Kamal Haasan) తన పార్టీ ఎంఎన్‌ఎం ద్వారా ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎంకే – ఎంఎన్‌ఎం మధ్య ఒక అంగీకారం జరిగినట్లు తమిళ మీడియా కథనాలు వెల్లడించాయి. కమల్ హాసన్‌ (Kamal Haasan) కు ‘లోక్‌సభకు పోటీ చేయాలా? లేక రాజ్యసభకు వెళ్లాలా?’ అనే ఎంపికను డీఎంకే ఇచ్చినట్లు సమాచారం. చివరికి కమల్ రాజ్యసభ వైపు మొగ్గు చూపినట్లు ఆ కథనాల ప్రకారం తెలుస్తోంది. కమల్ హాసన్ (Kamal Haasan) 2018, ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, అప్పటి నుంచి ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం మాత్రం చూపలేకపోయింది. ఇక‌, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ పోటీ చేసినా, విజయం దక్కలేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 3.72 శాతం ఓట్ల వాటా సాధించింది. ఈ ఎంపికతో కమల్ హాసన్‌ (Kamal Haasan) కు రాజకీయంగా మరింత విలువ పెరగనుంది. MNM పార్టీ ప్రజాదరణ లేకున్నా, రాజ్యసభ ద్వారా కమల్ తన భావజాలాన్ని, ప్రజల ఆవశ్యకతలను బలంగా వ్యక్తపరచే అవకాశం ఉంది.

Read Also: Kami Rita: 31వ సారి ఎవరెస్ట్ ను అధిరోహించిన కమీ రీటా

Breaking News in Telugu Google news Kamal Haasan to Latest News in Telugu Paper Telugu News Rajya Sabha Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.