📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kamal Haasan: ‘థగ్ లైఫ్’ విడుదలపై హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్

Author Icon By Shobha Rani
Updated: June 2, 2025 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) “తమిళం నుంచే కన్నడ పుట్టింది” అంటూ చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వివాదం చల్లారే సూచనలు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటిస్తున్న ‘థ‌గ్ లైఫ్’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించడంతో కమల్ హాసన్ (Kamal Haasan) నేడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహులు మాట్లాడుతూ, ఆయన క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ‘థ‌గ్ లైఫ్’ విడుదల కాదు. ఇది ఖాయం. ఇది పరిశ్రమకు సంబంధించిన విషయం కాదు. రాష్ట్రానికి సంబంధించింది. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ అనుకూల సంస్థలు ఆయన స్పందించాలని కోరాయి. ఆయన క్షమాపణ చెప్పకుండా సినిమా విడుదల కావడం కష్టం. మా ఎగ్జిబిటర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ సినిమాను ప్రదర్శించడానికి సిద్ధంగా లేరు. అలాంటప్పుడు సినిమా ఇక్కడ ఎలా విడుదలవుతుంది? అని ప్రశ్నించారు. అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ… కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, ఆ విషయం కమల్ హాసన్‌కు తెలియదని అన్నారు.

Kamal Haasan: ‘థగ్ లైఫ్’ విడుదలపై హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్

రాజకీయ నేతల స్పందనలు
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కమల్ హాసన్ (Kamal Haasan) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాతృభాషను ప్రేమించాలి. కానీ దాని పేరుతో అహంకారం ప్రదర్శించడం సాంస్కృతిక దివాలాకోరుతనానికి నిదర్శనం. ముఖ్యంగా కళాకారులకు, ప్రతి భాషను గౌరవించే సంస్కారం ఉండటం చాలా అవసరం అని ఆయన అన్నారు. కన్నడతో సహా పలు భాషల్లో చిత్రాలు చేసిన కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యలు పూర్తిగా అహంకార పూరిత‌మైన‌వి అని బీజేపీ నేత విమర్శించారు. ఇప్ప‌టికే అనేక కన్నడ సంఘాలు కూడా క‌మ‌ల్‌ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. “ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై నాకు ఉన్న ప్రేమ నిజమైంది. ఏదో ఒక అజెండా ఉన్నవాళ్లు తప్ప ఎవరూ దానిని అనుమానించరు. నన్ను గతంలో కూడా బెదిరించారు. నేను తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతాను. తప్పు చేయకపోతే చెప్పను అని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ పరిణామాలతో ‘థ‌గ్ లైఫ్’ సినిమా విడుదలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ వివాదం తెలివిగా పరిష్కారమవుతుందా? కమల్ హాసన్ (Kamal Haasan) వెనక్కి తగ్గుతారా? లేదా ‘థగ్ లైఫ్’ మూవీపై కర్ణాటకలో నిషేధం అమలవుతుందా? అన్నది వేచి చూడాల్సిన విషయం.

Read Also: Movie Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా రివ్యూ!

#telugu News approached the High Court Breaking News in Telugu Google news Kamal Haasan Latest News in Telugu over the release of 'Thug Life' Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.