భారత రాజకీయ వేదికపై తరచూ కామెడీ వ్యాఖ్యలతో కనిపించే డాక్టర్ కేఏ పాల్ (K.A.Paul) అంతర్జాతీయ వేదికలపై మాత్రం పూర్తిగా భిన్నమైన, గంభీరమైన నేతగా తన గుర్తింపును చాటుకుంటున్నారు. తాజాగా ఆయనకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆహ్వానం అందుకున్న ఆయన, అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ సభను ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. సెనేట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన కె.ఎ. పాల్, భారత్ మరియు అమెరికా ప్రపంచానికి రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. ఈ రెండు అగ్రదేశాలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే విశ్వవ్యాప్తంగా శాంతి స్థాపన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో శాంతి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఈ రెండు దేశాలపై ఉందని ఆయన నొక్కిచెప్పారు. 58 యుద్ధాలపై తీవ్ర ఆందోళన… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న 58 యుద్ధాల పట్ల కె.ఎ. పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాల వల్ల కోట్లాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, ట్రిలియన్ల డాలర్ల ప్రజా ధనం నాశనం కావడం మానవాళికి తీరని నష్టమని సెనేట్ సభ్యులకు వివరించారు.
Read Also: America: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
సెనేట్ సాక్షిగా ప్రత్యేక శాంతి ప్రార్థన
ఈ విధ్వంసం ఆగిపోవాలని, దేశాల మధ్య ద్వేష భావాలు తొలగిపోవాలని కోరుతూ సెనేట్ సాక్షిగా ప్రత్యేక శాంతి ప్రార్థన నిర్వహించడం సభను భావోద్వేగానికి గురిచేసింది. రూ.1.8 కోట్లు ఫైన్ వేసిన కోర్ట్” యుద్ధాలకు ఖర్చు చేస్తున్న అపార వనరులను పేదరిక నిర్మూలనకు, విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి మళ్లిస్తే ప్రపంచ ముఖచిత్రమే మారిపోతుందని కె.ఎ. పాల్ సూచించారు. ఆయుధాల కంటే మానవ విలువలే ప్రపంచాన్ని రక్షిస్తాయని ఆయన వ్యాఖ్యలు సభలో హర్షధ్వనులకు దారి తీశాయి. భారతీయుడిగా గర్వకారణం అమెరికా లాంటి అగ్రరాజ్యపు చట్టసభలో భారతీయుడిగా శాంతి సందేశాన్ని వినిపించడం తనకు గర్వకారణమని కె.ఎ. పాల్ తెలిపారు. ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన సెనేట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మత ప్రచారకుడిగా, శాంతి దూతగా అమెరికాలో ఆయనకు ఉన్న గుర్తింపు మరోసారి స్పష్టమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: