📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Jyoti Malhotra : జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవు.. హిస్సార్‌ ఎస్పీ

Author Icon By Sudha
Updated: May 22, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన ఈ యూట్యూబర్‌పై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, హర్యానా పోలీసులు తాజా ప్రకటనలో ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఉగ్రవాదులతో జ్యోతికి ఎలాంటి సంబంధాలూ లేవని (no links to terror) తెలిపారు. పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో (Pakistani intelligence officials) ఆమె సంప్రదింపులు కొనసాగించినట్లు చెప్పారు.

Jyoti Malhotra : జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవు.. హిస్సార్‌ ఎస్పీ

ఎలాంటి ఆధారాలూ లేవు
ఈ కేసు వివరాలను హిస్సార్‌ ఎస్పీ (Hisar SP) మీడియాకు వెల్లడించారు. ‘జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో గానీ, ఉగ్రవాదులతో గానీ సంబంధాలున్నట్లు ఇప్పటివరకూ మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆమె ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు కూడా ఎలాంటి సాక్ష్యాలూ లభించలేదు. పాకిస్థాన్ నిఘా వర్గాల అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లుగానీ, మతం మార్చుకోవాలనే ఉద్దేశం గానీ జ్యోతికి ఉన్నట్లు ధ్రువీకరించే పత్రాలు ఏవీ లభించలేదు. తాను మాట్లాడుతున్న వారు పాక్‌ గూఢచర్య సంస్థకు చెందినవారని ఆమెకు తెలుసు. అయినా, పూర్తి స్పృహతోనే వారితో సంప్రదింపులు కొనసాగించింది. అంతేకాదు, భారత సాయుధ బలగాల వ్యూహాలు, ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు’ అని హిస్సార్‌ ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు జ్యోతి డైరీ ఒకటి వెలుగులోకి వచ్చిందంటూ వస్తున్న వార్తలపై కూడా పోలీసులు స్పందించారు. అలాంటి డైరీ ఏమీ తాము స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. ఆమెకు చెందిన మూడు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. వాటిని పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.

Read Also : Tesla CFO: టెస్లా బంపర్ ఆఫర్.. ఢిల్లీ కుర్రాడికి వెయ్యి కోట్ల జీతం

Breaking News in Telugu Google news Hissar SP Jyoti has no links Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.