📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

YOUTUBER JYOTI: హిందూ ఆలయాలపై జ్యోతి కుట్రలు ?

Author Icon By Shobha Rani
Updated: May 21, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్​(Pakistan)కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి(YOUTUBER JYOTI) మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండేళ్లలో దేశంలోని ప్రముఖ దేవాలయాలను జ్యోతి సందర్శించి, వీడియోలను తీసింది. ఈ క్రమంలో భారత్​లోని హిందూ ఆలయాల గురించి పాక్ ఏమైనా సమాచారం ఇచ్చిందా? గుడులపై దాడులకు ఏమైనా కుట్ర చేయించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
అజైబినాథ్ ఆలయం సందర్శన
రెండేళ్ల క్రితం (2023) జ్యోతి బిహార్ సుల్తాన్​గంజ్​లో రెండు రోజులు బస చేసింది. శ్రావణ మాసంలో అజైబినాథ్ ఆలయం, దాని సమీపంలోని అన్ని ప్రసిద్ధ ప్రదేశాలను వీడియో తీసి యూట్యూబ్​లో అప్లోడ్ చేసింది. ఆ సమయంలో నాథ్ నగర్​కు చెందిన ఒక యూట్యూబర్ ఆమెకు సాయం చేశాడు. అజైబినాథ్ ధామ్ సమీపంలోని పెద్ద మసీదుకు కూడా జ్యోతి(JYOTI) వెళ్లినట్లు తెలుస్తోంది. జ్యోతి ఆలయ సందర్శనలో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. జ్యోతి (JYOTI) సందర్శించిన మతపరమైన ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అలాగే జ్యోతితో పరిచయం ఉన్న యూట్యూబర్ పైనా పోలీసులు నిఘా పెట్టారు.
“అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అజైబినాథ్ ఆలయ భద్రతను కూడా పెంచాం. ఆలయ ప్రాంగణంలో సీసీటీవీలను పరిశీలిస్తున్నాం. జ్యోతి మల్హోత్రా భాగల్​పుర్ పర్యటన సందర్భంగా కలిసిన వారందరినీ విచారిస్తున్నాం. జ్యోతి (JYOTI) 2024లో హిసార్ నుంచి ఉజ్జయినికి రైలులో, ఇందౌర్ నుంచి ఢిల్లీకి బస్సులో ప్రయాణించి, “ట్రావెల్ విత్ జో” ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో బాబా మహాకాళేశ్వర్ ఆలయ ప్రధాన ద్వారం, గర్భగుడి వంటి వివరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహాకాళేశ్వర్ ఆలయంలో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి. “జ్యోతి మల్హోత్రా ఏడాది క్రితం ఉజ్జయినికి వచ్చినట్లు సమాచారం అందింది. ఈ కేసు దర్యాప్తునకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ బృందం జ్యోతిని విచారించడానికి బయలుదేరుతోంది. ఆమె ఉజ్జయిని వచ్చి ఎవరిని కలిసింది. ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటాం. భక్తులు ఎటువంటి భయాలు లేకుండా ఉజ్జయినికి రావాలి. వారి భద్రత మా బాధ్యత. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం.” అని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు.

YOUTUBER JYOTI: హిందూ ఆలయాలపై పాక్ స్పై జ్యోతి మల్హోత్రా కుట్ర ? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై ఆరోపణలు

ఉత్తరాఖండ్ ఆలయాల సందర్శన
అలాగే ఉత్తరాఖండ్ లోని కేదార్​నాథ్, గంగోత్రి, బద్రీనాథ్, దెహ్రాదూన్, హరిద్వార్, రిషికేశ్‌ సహా వివిధ ప్రదేశాలను సందర్శించిన వీడియోను జ్యోతి యూట్యూబ్ లో పెట్టింది. కేదార్​నాథ్ ధామ్ ఏర్పాట్ల గురించి ఆ వీడియోలో సమాచారం అందించింది. ఆహారం, వసతి గురించి వివరించింది. దెహ్రాదూన్ నుంచి నేపాల్ కు కూడా ప్రయాణించింది. ఈ రెండు ప్రదేశాల మధ్య నడుస్తున్న మైత్రి బస్సు సర్వీస్ గురించి ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భారత్- పాక్ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్​లోని బాడ్​మేర్​లోనూ ఏడాదిన్నర క్రితం జ్యోతి ఓ వీడియోను చేసింది. బాడ్​మేర్ నుంచి మునాబావో వరకు రైలులో ప్రయాణించింది. సరిహద్దు ప్రాంతంలోని ఒక కుగ్రామంలో ఒక రాత్రి బస చేయడం గురించి పలు అనుమానాలు కలుగుతున్నాయి. బయటి వ్యక్తులు సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి, వీడియోలను తీయడానికి అధికారులు అనుమతి పొందాలి. మరీ జ్యోతి సరిహద్దు ప్రాంతానికి ఎలా చేరుకుంది? వీడియో చేయడానికి సరిహద్దు పోలీసు స్టేషన్ల నుంచి అనుమతి తీసుకుందా? పర్మిషన్ లేకుండా వ్లాగింగ్ వీడియోను చిత్రీకరించిందా? అనే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఇప్పటివరకు కూతురును సమర్థ … జ్యోతి తండ్రి హరీష … , తన కుమార్తె పాకిస్తాన్ వెళ్ళిపోతున్నట్లు ఎప్పుడూ … , ఢిల్లీకి వెళ్ళిపోతున్నానని మాత్రమే చెప్పారు అని ఆయన వెల్లడించారు.

Read Also: Gaza: గాజాను తక్షణమే ఆదుకోండి.. పోప్ లియో విజ్ఞప్తి

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Malhotra conspiracy on Hindu temples? Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.