📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయానికి ప్రధాన కారణం భారత టాప్ ఆర్డర్ వైఫల్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ (Jos Butler) మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ చేసిన ధీమా వ్యాఖ్యలే ఈ పరాజయానికి మూలకారణమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ మ్యాచ్ ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ (Sachin Trophy) లో భాగంగా జరిగింది. ఈ గేమ్ ముగిసే సరికి ఇంగ్లండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యం పొందింది.

ఉత్తేజపరిచినట్లు

నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం స్కై స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్ సుందర్, భారత్ ఐదో రోజు లంచ్ సమయానికి లక్ష్యాన్ని ఛేదిస్తుందని ధీమాగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్ జట్టును ఉత్తేజపరిచినట్లు బట్లర్ తెలిపాడు.వాషింగ్టన్ సుందర్ చేసిన కామెంట్స్, ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల (England players) ను ప్రేరేపించాయి. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసిని కలిగించాయి. వాషింగ్టన్ సుందర్ కామెంట్స్ గురించి విన్న తర్వాత నిజంగా అతను అలా అన్నాడా? అనిపించింది. భారత్ విజయం సాధిస్తుంది. మేం 2-1తో ఆధిక్యం సాధిస్తామని ఎంతో నమ్మకంతో సుందర్ అనడం వీడియోలో కనిపించింది. బహుషా అతను పొరబాటున ఈ వ్యాఖ్యలు చేశాడేమోనని అనుకున్నా.

Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?

డ్రెస్సింగ్ రూమ్‌

గెలవాలని ఆశిస్తున్నానని చెప్పబోయి గెలుస్తామని తప్పుగా పలికాడని భావించా. అయితే ఈ వీడియోను ఎవరో ఒకరు డ్రెస్సింగ్ రూమ్‌‌లో చూపించి ఉంటారు.ఈ రోజుల్లో ఏది మిస్సవ్వరు కదా? ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు ఏం మాట్లాడకుండా ఇంగ్లండ్ ఆటగాళ్లందరికి ఈ వీడియో ప్లే చేసి చూపించి ఉంటారు. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌ బాల్కానీ నుంచి మెక్‌కలమ్ ‘ఎక్కువగా మాట్లాడింది ఇతనే, మన సత్తా ఏంటో చూపించండి’అని సైగలు చేశాడు. ఓటమి తర్వాత తన వ్యాఖ్యల పట్ల వాషింగ్టన్ సుందర్ పశ్చాతాపానికి గురై ఉంటాడు’అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

జోస్ బట్లర్‌కు ఐపీఎల్‌లో జీతం ఎంత?

జోస్ బట్లర్ ఐపీఎల్‌లో 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 4.4 కోట్లకు కొనుగోలు చేసింది. 2021 వరకు అదే జీతంతో కొనసాగాడు.2022లో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 10 కోట్లకు రిటైన్ చేసింది.అయితే, 2025 మెగా వేలంలో గుజరాత్ టైటన్స్ జట్టు బట్లర్‌ను రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసింది.

జోస్ బట్లర్‌కి ఇష్టమైన క్రికెటర్ ఎవరు?

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ తనకు ప్రస్తుత తరం ఆటగాళ్లలో అత్యంత ఇష్టమైన క్రికెటర్ రోహిత్ శర్మ అని పలుమార్లు చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: King Charles : కింగ్ ఛార్లెస్ ప్రశ్న.. శుభ్‌మన్ గిల్ ఏం చెప్పాడంటే..

Breaking News IND vs ENG Lords Test 2025 India test series loss India vs England 3rd Test Jos Buttler interview latest news Sundar controversial statement Washington Sundar comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.