📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

China: జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

Author Icon By Vanipushpa
Updated: February 3, 2026 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్, చైనా సంయుక్తంగా రూపొందించిన జేఎఫ్-17 (JF-17) థండర్ యుద్ధ విమానానికి అంతర్జాతీయంగా గిరాకీ ఎక్కువైంది. ఇటీవల భారత్‌తో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఈ విమానాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయని పాక్ చేసిన ప్రకటనల నేపథ్యంలో.. పలు దేశాలు వీటి కొనుగోలుకు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరగడంతో పాకిస్థాన్ తల పట్టుకుంటోంది. ఈ యుద్ధ విమానాల అమ్మకం ద్వారా బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నా, ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడే ఛాన్స్ వచ్చినా.. ఉత్పత్తి సామర్థ్యం లేక నేల చూపులు చూస్తోంది.

Read Also: USA: టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

China: జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

ఇరాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, లిబియా దేశాల ఆసక్తి

గత కొద్ది నెలలుగా ఇరాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, లిబియా దేశాలు ఈ విమానం పట్ల తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా ఏకంగా తన అప్పులను ఈ విమాన ఒప్పందంగా మార్చుకోవాలని యోచిస్తుండటం దౌత్య వర్గాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల విమానాలపై ఆధారపడే సౌదీ అరేబియా, ఇండోనేషియా వంటి దేశాలు జేఎఫ్-17 వైపు మొగ్గు చూపడం.. రక్షణ రంగంలో కీలక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా జేఎఫ్-17 విమానాలకు ఇంతలా క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం దాని ధర. పాశ్చాత్య దేశాల విమానాలు అయిన రఫేల్, ఎఫ్-16 ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చ అవుతుంటే.. జేఎఫ్-17 కేవలం 40 నుంచి 50 మిలియన్ డాలర్లకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారడంతో.. అందరి కన్ను దీనిపై పడింది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఏడాదికి కేవలం 16 నుంచి 20 విమానాలను మాత్రమే తయారు చేయగలదు. దీనికి తోడు ఉత్పత్తిని పెంచడానికి పాకిస్థాన్‌కు భారీ నిధులు అవసరం. కానీ ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదు. ఇది చాలదన్నట్లుగా రష్యాకు భారత్ పెద్ద కస్టమర్ కావడంతో.. పాకిస్థాన్‌కు విడిభాగాల సరఫరా విషయంలో ఆ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ead hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

defence news South Asia fighter jets news India Pakistan defence JF-17 Thunder military aviation Pakistan Air Force Pakistan defence issues Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.