Death Mystery: జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

Read Time:  1 min
జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?
జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?
FONT SIZE
GET APP

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం ప్రధాని నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein) మరణం రహస్యం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. 2019లో ఆయన జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. తాజాగా అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాలు అనేక రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్‌స్టీన్ మరణించాడని ప్రకటించే అధికారిక ప్రకటనను, ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందే అధికారులు సిద్ధం చేసినట్లు ఈ ఫైళ్లు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన 23 పత్రాల్లో.. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం రూపొందించిన ఒక డ్రాఫ్ట్ స్టేట్‌మెంట్ కలకలం రేపుతోంది. దీనిపై 2019 ఆగస్టు 9వ తేదీ అని ఉండగా.. ఎప్‌స్టీన్ మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీన ఉదయం తన జైలు గదిలో విగతజీవిగా కనిపించాడు. అప్పటి అటార్నీ జెఫ్రీ ఎస్. బెర్మన్ పేరుతో ఉన్న ఈ ప్రకటనలో.. “ఈ ఉదయం ఎప్‌స్టీన్ మరణించినట్లు మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ ధృవీకరించింది” అని ఉంది. ఒక వ్యక్తి మరణించడానికి 24 గంటల ముందే ఆయన చనిపోయినట్లు ప్రకటన సిద్ధం కావడం వెనుక ఏదైనా ముందస్తు ప్లాన్ ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

Read Also: AP Development: క్వాంటం వ్యాలీతో లక్ష ఉద్యోగాల అంచన?

Death Mystery: జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?
Death Mystery: జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

ఖైదీలను తరలించడం జైలు నిబంధనలకు విరుద్ధం

ఎప్‌స్టీన్ మరణానికి కొన్ని గంటల ముందు జైలులోని నిఘా కెమెరాల ఫుటేజీని విశ్లేషించిన ఇన్వెస్టిగేటర్లకు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆగస్టు 9వ తేదీ రోజు రాత్రి 10.39 గంటల సమయంలో.. ఎప్‌స్టీన్ సెల్ ఉన్న ప్రాంతం వైపు ఒక ‘ఆరెంజ్ కలర్’ డ్రెస్ వేసుకున్న వ్యక్తి వెళ్తున్నట్లు గుర్తించారు. న్యాయశాఖ దీనిని ఒక అధికారి అని చెబుతున్నప్పటికీ.. స్వతంత్ర విశ్లేషకులు మాత్రం అది జైలు దుస్తుల్లో ఉన్న మరో ఖైదీ అని అభిప్రాయ పడుతున్నారు. ఆ సమయంలో ఖైదీలను తరలించడం జైలు నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ అంశం మరింత అనుమానాస్పదంగా మారింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన గొంతు వద్ద ఎముకలు విరిగి ఉన్నట్లు నివేదించింది. సాధారణంగా ఇలాంటి గాయాలు ఉరి వేసుకున్న వారి కంటే, గొంతు పిసికి చంపిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.