📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఏవిధంగానైనా గద్దె దించడానికి ప్రతిపక్షాలు యత్నిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రెండవసారి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆయన ఘనతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంది. ఇందులో జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం ఒకటి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. అమెరికా అంతటా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విచారణకు సంబంధించిన అమెరికా న్యాయశాఖ దాదాపు 30,000 పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేసింది. అయితే, ఈ పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (TRump) పై ఉన్న ఆరోపణలు అవాస్తవమని న్యాయశాఖ స్పష్టం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Read also: Blue Bird Block-2: ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అబద్ధపు ఆరోపణలు

30వేల పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ జుడిషియల్ డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో ఓ వివరణ ఇచ్చింది. అందులో ‘ఈ పైల్స్ లో కొన్ని డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అబద్ధపు ఆరోపణలు ఉన్నాయి. ఇవి 2020 ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ఎఫ్ బిఐకి అందిన సమాచారం. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పు అని వాటిలో కనీసం నిజం ఎంత ఉన్నా..అవి ఎప్పుడో ట్రంప్ పై ఆయుధాలుగా ఉపయోగపడేవి, పారదర్శకత కోసం చట్టప్రకారం ఈ పత్రాలను యథాతథంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అనవసర రాద్దాంతరం చేస్తున్న డెమోక్రాట్లు: ట్రంప్

ఈ పత్రాల విడుదల అమెరికా రాజకీయాల్లో వేడిని పెంచింది. అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ‘తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. రిపబ్లికన్ పార్టీ సాధిస్తున్న విజయాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డెమోక్రాట్లు ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన
ఆరోపించారు. మరోవైపు, ఈ ఫైల్స్ లో మరిన్ని కీలక విషయాలను ఎడిట్ చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి, ఎప్లిన్ ఫైల్స్ విడుదల ద్వారా అమెరికా ప్రభుత్వం పారదర్శకతను చాటుకోవాలని చూస్తున్నప్పటికీ, ట్రంప్పేరు చుట్టూ తిరుగుతున్న వివాదాలు మాత్రం ఇప్పట్లో
సద్దుమణిగేలా లేవు. ఎప్ స్టీన్ మరణించిన తర్వాత రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలో ట్రంప్ పేరును ప్రస్తావించారు. అయితే ఆ లేఖలో హ్యాండ్ రైటింగ్ ఎప్ స్టీన్ది కాదని, అదిపూర్తిగా నకిలీ అని ఎఫ్ బీఐ తేల్చి చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump news Epstein scandal latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.