📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : JD Vance – రష్యాను ఆర్థికంగా అణిచేయడానికే ట్రంప్ చర్య: : జేడీ వాన్స్‌

Author Icon By Sudha
Updated: August 25, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి కారణంగా భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తుండటమే అని పేర్కొన్నారు. ట్రంప్ చర్యపై అమెరికా లోపల, భారత్‌లో, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఈ విషయంపై స్పందిస్తూ, టారిఫ్‌లను వ్యూహాత్మకంగా ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదనపు టారిఫ్‌లు (US tariffs) విధించిన విషయం తెలిసిందే. అమెరికా తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై యూఎస్‌ విధించిన టారిఫ్‌లపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించినట్లు చెప్పుకొచ్చారు.

JD Vance – రష్యాను ఆర్థికంగా అణిచేయడానికే ట్రంప్ చర్య: : జేడీ వాన్స్‌

ఎన్‌బీసీ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్‌ (JD Vance) మాట్లాడుతూ.. ‘రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కావాలనే భారత్‌పై అధిక టారిఫ్స్‌ విధించారు. ఆయిల్‌ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు. చమురు నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతే ఉక్రెయిన్‌పై దాడులు చేయడం మాస్కోకు కష్టతరమవుతుంది. దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్స్‌ ఇందులో భాగమే. హత్యలను ఆపితే రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఆహ్వానించొచ్చు. కానీ, దాడులు కొనసాగితే అది ఒంటరిగా ఉండాల్సి వస్తుంది’ అని జేడీ వాన్స్‌ తెలిపారు.

జెడి వాన్స్ నికర విలువ?

జెడి వాన్స్ నికర విలువ దాదాపు $10 మిలియన్లు అంటే సుమారు రూ.85,37,75,000. ఇందులో దాదాపు $4 మిలియన్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడి ద్వారా సంపాదించగా, అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆయన ఏడాది జీతం $235,100. అంతకుముందు, జెడి వాన్స్ సిన్సినాటి నుండి సెనేటర్‌గా ఉన్నారు. దీనికోసం అతను వార్షిక జీతం $174,000 అందుకున్నాడు.

జేడీ వాన్స్‌ చరిత్ర?

వాన్స్ ఒహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించాడు. ఉన్నత పాఠశాల తర్వాత, వాన్స్ మెరైన్ కార్ప్స్‌లో చేరాడు, అక్కడ అతను 2003 నుండి 2007 వరకు మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు, 2005లో ఆరు నెలల పాటు ఇరాక్ యుద్ధంలో పనిచేశాడు. అతను 2009లో ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీతో, 2013లో యేల్ లా స్కూల్ నుండి లా డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. టెక్ పరిశ్రమలో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించడానికి ముందు అతను కొంతకాలం కార్పొరేట్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. అతని జ్ఞాపకాలైన హిల్‌బిల్లీ ఎలిజీ 2016[2]లో ప్రచురించబడింది, 2020లో చలనచిత్రంగా మార్చబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-modi-zelensky-big-shock-for-trump-india-visit-soon/international/535754/

Breaking News Donald Trump India US Tariffs JD Vance latest news Russia Oil Telugu News US India relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.