📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Army Personnel Blackmailing: జవాన్ దారుణం: మహిళ బాత్రూమ్​లో రహస్య కెమెరా

Author Icon By Shobha Rani
Updated: May 19, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాత్రూమ్​లో మహిళ స్నానం చేస్తుండగా సీక్రెట్ కెమెరాతో వీడియోను రికార్డు చేశాడు ఓ జవాన్. అక్కడితో ఆగకుండా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సైనికుడిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ ఘటన జరిగింది. ఈతంగాడు ప్రాంతానికి చెందిన మధురాజా, మిజోరాంలో ఇండియన్ ఆర్మీ(Army) లో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి గృహప్రవేశ వేడుకకు తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. అప్పటినుంచి వారి ఇంటిని టార్గెట్ చేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఈతమోళి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కొత్త ఇల్లును నిర్మించుకుంది. ఈ క్రమంలోనే మహిళ కుటుంబం గృహ ప్రవేశం ఫంక్షన్ చేసింది. ఈ కార్యక్రమానికి బంధువులు, శ్రేయాభిలాషులను ఆహ్వానించింది. ఈ ఫంక్షన్​కు వెల్లిసంధై సమీపంలోని ఈతంగాడు ప్రాంతానికి చెందిన ఆర్మీ (Army) జవాన్ మధురాజా కూడా తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. విధుల కోసం మిజోరాంలో ఉన్న మధురాజా, ఇప్పటివరకు పలు సార్లు సెలవుపై ఇంటికి వచ్చాడు. ప్రతీసారి బాధితురాలిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరిసారి వచ్చినప్పుడు, ఆమె స్నాన వీడియోను చూపించి లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు.

Army Personnel Blackmailing: జవాన్ దారుణం: మహిళ బాత్రూమ్​లో రహస్య కెమెరా

బాత్రూంలో కెమెరా అమర్చిన విధానం
మిజోరాంలో ఇండియన్ ఆర్మీ(Army) లో స్టోర్ కీపర్​గా పనిచేస్తున్న మధురాజా మహిళ ఇంటి బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చాడు. ఆ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్​లో చూసేవాడు. బాత్రూంలోని కెమెరాను తన మొబైల్​కు లింక్ చేసి మహిళ స్నానం చేస్తున్న వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం విధుల నిమిత్తం మిజోరంకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెలవుపై ఇంటికి వచ్చినప్పుడల్లా బాధిత మహిళను లైంగికంగా వేధించేవాడు.మధురాజా బాత్రూంలో కెమెరా అమర్చిన విధానంపై ఇతర మహిళలపైనా ఇలాంటి చర్యలు తీసుకున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఫారెన్సిక్ పరిశీలన, అతని ఫోన్, కెమెరాల డేటా – అన్నీ పరిశీలించబడతాయి. అయితే, ఇటీవలే సెలవులపై స్వగ్రామానికి వచ్చిన మధురాజా, బాధితురాలిని కలిశాడు. ఆమె స్నానం చేస్తున్న వీడియోను సెల్‌ ఫోన్‌ లో చూపించి మరోసారి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. తన లైంగిక కోరికలను తీర్చకపోతే ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. స్నేహితులు, బంధువులకు పంపిస్తానని చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన మహిళ ఎతమోళి పోలీస్ స్టేషన్​లో జవాన్​పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని జైలుకు తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read Also: Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Woman's Bathroom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.