📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jasprit Bumrah: సంబరాలకు దూరంగా ఉంటానన్న బుమ్రా..

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంబరాలు చేసుకోకపోవడం

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో, మ్యాచ్‌ను ఇండియా ఆధీనంలోకి తీసుకొచ్చాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు, తద్వారా “హానర్స్ బోర్డు”పై తన పేరు లిఖించించుకున్నాడు. ఇది లార్డ్స్‌లో ప్రతి బౌలర్ కలలు కంటారు.ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను కట్టడి చేయడంలో బుమ్రా పాత్ర కీలకంగా మారింది.పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుమ్రా బౌలింగ్ ప్రదర్శన ఎంతగా ప్రశంసలు అందుకుందో, అతని నిశ్శబ్ధ ప్రతిస్పందన కూడా అభిమానుల్లో అంతగా చర్చనీయాంశమైంది. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యేందుకు సహాయపడింది.ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ మరోసారి తాను భారత్ తరఫున ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడని నిరూపించాడు.

అత్యధిక వికెట్లు

ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్‌ను అధిగమించాడు. భారత్ తరఫున ఇంగ్లండ్‌లో ఆడిన 13 టెస్ట్ మ్యాచ్‌లలో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు మూడు వికెట్లు తీసి 47 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించాడు. అంతే కాకుండా బుమ్రా కెరీర్‌లో లార్డ్స్‌లోని ప్రసిద్ధ ‘హానర్స్ బోర్డు’లో పేరు నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత బుమ్రా ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. అసలు అలా ఎందుకు ఉన్నాడని విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్ (Press conference) లో బుమ్రా స్పష్టతనిచ్చాడు. దీనికి కారణం అలసట అంటూ చెప్పుకొచ్చాడు.నిజం చెప్పాలంటే నేను బాగా అలసిపోయాను. అక్కడ సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదు. మైదానంలో చాలా సమయంపాటు బౌలింగ్ చేసి శారీరకంగా అలసిపోయా. ఎగిరి గంతులు వేసేందుకు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు.

చారిత్రాత్మక

సాధారణంగానే నేను అలా చేయడానికి ఇష్టపడను. నా ఐదు వికెట్ల ప్రదర్శనపై ఆనందంగా ఉన్నా. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయా. జట్టు తోడ్పడినందుకు సంతోషంగా ఉంది.” అని బుమ్రా తెలిపాడు. చారిత్రాత్మక లార్డ్స్ మైదానం (Lord’s Ground) లో 18 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగా రెండో రోజు 9 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇది బుమ్రాకు 15వ 5 వికెట్ల ప్రదర్శన. విదేశాల్లో ఇది 12వ సారి.అండర్సన్-టెండూల్కర్ సిరీస్ లో భాగంగా 1-1తో సమంగా ఉన్న భారత్, ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైంది.

క్రీజు

జస్ప్రీత్ బుమ్రా సిరీస్ లో రెండో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. జో రూట్(104) శతకం పూర్తి చేయగా.. జేమీ స్పిత్(51), బ్రైడన్ కార్స్(56) హాఫ్ సెంచరీలతో జట్టు మంచి స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా (TeamIndia) రెండోరోజు ఆట చివరికి 145/3తో నిలిచింది. కేఎల్ రాహుల్(53), రిషబ్ పంత్(19) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(13) త్వరగా ఔటైనప్పటికీ కేఎల్ రాహుల్ తన 53 పరుగుల ఇన్నింగ్స్ తో నాటౌట్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ వేలికి గాయమైనప్పటికీ ఐదో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసి భారత జట్టును ఆదుకున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా భార్య ఎవరు?

బుమ్రా భార్య పేరు, సంజనా గణేశన్ (Sanjana Ganesan),ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌, టీవీ ప్రెజెంటర్‌.

బుమ్రా ఏజ్ ఎంత?

జస్ప్రీత్ బుమ్రా ఏజ్ 31 ఇయర్స్.

Read hindi news:hindi.vaartha.com

Read Also: Jasprit Bumrah: డబ్ల్యూటీసీలో చరిత్ర సృష్టించిన బుమ్రా..

#telugu News Breaking News Bumrah bowling highlights Bumrah silent celebration Honours Board Lord’s India vs England 3rd Test 2025 Jasprit Bumrah 5 wickets Lord's latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.