📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jasprit Bumrah: డబ్ల్యూటీసీలో చరిత్ర సృష్టించిన బుమ్రా..

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తొలి బౌలర్‌గా

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తన బౌలింగ్ ప్రతిభతో మ్యాచ్‌లను తిప్పేసే శక్తి ఉన్న బుమ్రా, ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా బుమ్రా (Jasprit Bumrah) కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్- సచిన్ ట్రోఫిలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/74) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు డబ్ల్యూటీసీలో ఇది 12వ ఐదు వికెట్ల ఘనత. ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను అధిగమించాడు. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

లార్డ్స్ టెస్ట్‌లో

WTC చరిత్రలో అత్యధిక‌సార్లు ఐదు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితా ఇదే,జస్ప్రీత్ బుమ్రా (భారత్): 37* మ్యాచ్‌లు 12,రవిచంద్రన్ అశ్విన్(భారత్): 41 మ్యాచ్‌లు 11,పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా): 50 మ్యాచ్‌లు 10,నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా): 53 మ్యాచ్‌లు 10,ప్రభాత్ జయసూర్య(శ్రీలంక): 19 మ్యాచ్‌లు9. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్‌ జోరూట్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ (Pat Cummins) రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన జోరూట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్ట్‌ల్లో అతన్ని ఔట్ చేయడం బుమ్రాకు 11వ సారి కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 15వ సారి. వన్డేల్లో మూడు సార్లు ఔట్ చేసిన బుమ్రా, టీ20ల్లో ఒకసారి పెవిలియన్ చేర్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జోరూట్‌ను ప్యాట్ కమిన్స్ 14సార్లు ఔట్ చేశాడు. టెస్ట్‌ల్లో అతన్ని 11 సార్లు పెవిలియన్ చేర్చిన కమిన్స్, వన్డేల్లో మరో మూడు సార్లు ఔట్ చేశాడు.

Jasprit Bumrah: డబ్ల్యూటీసీలోచరిత్ర సృష్టించిన బుమ్రా..

ఐదు వికెట్లు

ఈ జాబితాలో జోష్ హజెల్ వుడ్(13), రవీంద్ర జడేజా(13), ట్రెంట్ బౌల్ట్(12) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఓవర్‌నైట్ స్కోర్ 251/4‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఓ వికెట్ తీసాడు. ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేయడం టీమిండియా కొంపముంచింది.

క్రికెట్ చరిత్రలో

ఈ అవకాశంతో చెలరేగిన అతను 8వ వికెట్‌కు బ్రైడన్ కార్స్‌తో కలిసి 84 పరుగులు జోడించాడు. జెమీ స్మిత్ క్యాచ్ పట్టి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగులకే ఆలౌటయ్యేది. బుమ్రా అందించిన ఆరంభాన్ని చెత్త ఫీల్డింగ్‌తో భారత ఆటగాళ్లు నాశనం చేసుకున్నారు.జస్‌ప్రీత్ బుమ్రా సాధించిన ఈ రికార్డు భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. యువ బౌలర్లకు ఇది ప్రేరణగా నిలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) లో అతని ప్రదర్శనలు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్‌లో బుమ్రా ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాయబోతున్నాడో చూడాలి.

జస్‌ప్రీత్ బుమ్రా ఏ రాష్ట్రానికి చెందినవారు?

జస్‌ప్రీత్ బుమ్రా గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌కి చెందినవారు.అతను డిసెంబర్ 6, 1993న అహ్మదాబాద్‌లో జన్మించాడు.ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ వేగం ఉన్న బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400కి పైగా వికెట్లు తీసిన ఘనత కూడా బుమ్రాకి ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా ఎందుకు స్పెషల్?

బుమ్రాను ప్రత్యేకంగా నిలిపే ప్రధాన కారణం అతని బౌలింగ్ శైలి. ఇతర ఫాస్ట్ బౌలర్ల కంటే బుమ్రా బంతిని బ్యాట్స్‌మన్‌కు చాలా దగ్గర నుండి వదులుతాడు. ఇది బ్యాట్స్‌మన్‌కు తక్కువ సమయాన్ని మాత్రమే ఇస్తుంది, దీని వలన బంతిని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Joe Root : లార్డ్స్ లో రూట్ సెంచరీ… బుమ్రాకు 4 వికెట్లు

#telugu News Breaking News Bumrah 5 wickets ICC World Test Championship India vs England Indian Cricket Team Jasprit Bumrah Lord’s Test Test match bowling WTC Records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.