📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Japan: అవును పెళ్లి చేసుకునందుకు బాదపడ్డ..జపాన్ మహిళల అసంతృప్తి

Author Icon By Vanipushpa
Updated: January 23, 2026 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌లో వివాహ బంధంపై తాజాగా వెలువడిన ఓ సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయాలకు పెద్దపీట వేసే జపాన్‌(Japan)లోనే వివాహ జీవితంపై ఇంతటి అసంతృప్తి వ్యక్తమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపనీస్‌ వివాహ సంబంధాల సంస్థ ‘ప్రెసియా’ నిర్వహించిన ఈ సర్వేలో, 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల 287 మంది వివాహిత మహిళలు పాల్గొన్నారు. వారిని ‘‘మీరు మీ భర్తను వివాహం చేసుకున్నందుకు చింతిస్తున్నారా?’’ అనే ఒక్క ప్రశ్న అడగగా, 70 శాతం మంది ‘అవును’ అని సమాధానమిచ్చారు. పెళ్లి చేసుకున్నందుకు జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో అయినా బాధపడ్డామని వారు వెల్లడించారు.

Read Also: Amazon: అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధం?

Japan: అవును పెళ్లి చేసుకునందుకు బాదపడ్డ..జపాన్ మహిళల అసంతృప్తి

భర్తలకు సరైన ఆర్థిక అవగాహన లేదు

ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… కాలం వెనక్కి తిరిగితే తమ ప్రస్తుత భర్తను మళ్లీ పెళ్లి చేసుకోబోమని 54 శాతం మంది మహిళలు స్పష్టం చేయడం. ఈ గణాంకాలు జపాన్‌లో వివాహ బంధం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులే తమ అసంతృప్తికి ప్రధాన కారణమని 37.2 శాతం మంది మహిళలు తెలిపారు. తాము ఆశించిన దానికంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని 22.6 శాతం మంది పేర్కొన్నారు. భర్తలకు సరైన ఆర్థిక అవగాహన లేదని 14.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంటిపనుల్లో భర్త సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు..

ఇంటిపనుల్లో భర్త సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 11.11 శాతం మంది తెలిపారు.ఇదే సమయంలో, మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 36.6 శాతం మంది మహిళలు భర్త శారీరక రూపం విషయంలో రాజీపడటం తమకు పెద్ద సమస్య కాదని వెల్లడించారు. అంటే, అందం కన్నా ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

gender roles in Japan Japan women Japanese society marriage challenges marriage dissatisfaction Modern Relationships Telugu News online Telugu News Today Women Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.