📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Japan: పార్లమెంటు​ను రద్దు చేసిన ప్రధాని సనాయె

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్ (Japan) పార్లమెంటును రద్దు చేశారు ప్రధానమంత్రి సనాయె తకాయిచి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రతినిధుల సభను రద్దు చేసి, ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. తన ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల మద్దతు కోరుతూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 465 మంది సభ్యులున్న దిగువ సభను రద్దు చేసి, ఈ నిర్ణయం తీసుకోవడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నిర్ణయంతో జపాన్‌లో తక్కువ సమయంలోనే హోరాహోరీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
ప్రస్తుత చట్టసభ్యుల పదవీకాలం 2028 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, తాను ఇంకా ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందలేదని తకాయిచి పేర్కొన్నారు. అందుకే ప్రజల తీర్పును కోరేందుకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరించారు.

Read Also: Canada: దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిన ట్రంప్

Japan: పార్లమెంటు​ను రద్దు చేసిన జపాన్ ప్రధాని

కొత్త కూటమిని ఏర్పాటు

మరోవైపు, ఈ ఎన్నికల్లో కొత్త ప్రతిపక్ష కూటమి కూడా రంగప్రవేశం చేయనుంది. జపాన్​ రాజ్యాంగ ప్రజాస్వామ్య పార్టీ, కోమెయిటో పార్టీ కలిసి ‘సెంట్రిస్ట్ రిఫార్మ్ అలయన్స్’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా జపాన్​లో పెరుగుతున్న జీవన వ్యయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఆహార పదార్థాలపై ఉన్న వినియోగ పన్నును తగ్గించే అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలు ఇస్తున్నాయి. అధికార పార్టీ పన్నును తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తుండగా, ప్రతిపక్షం పూర్తిగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఇక రాజకీయ నిధుల అంశం కూడా ఎన్నికల్లో కీలకంగా నిలవనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Asian politics Japan government Japan leadership Japan parliament dissolved Japan Prime Minister Japanese Politics snap elections Japan Telugu News online Telugu News Paper world political news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.