📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Japan Internet: ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో జ‌పాన్ సంచ‌ల‌నం

Author Icon By Sudha
Updated: July 11, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ‌పాన్‌లో ఇప్పుడు ఇంట‌ర్నెట్ (Japan Internet)రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను ఆ దేశం రూపొందించింది. ఒక సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో (At petabit speeds)ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని క‌నుగొన్నారు.జ‌పాన్‌లో ఆ వేగంతో కేవ‌లం సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. భార‌త్‌తో పోలిస్తే జ‌పాన్‌లో(Japan Internet) బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ స్పీడ్ 16 మిలియ‌న్ల సార్లు ఎక్కువ అని తెలిసింది. ఇండియాలో స‌గ‌టు ఇంట‌ర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీపీఎస్‌. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ టెక్నాల‌జీ ప్ర‌కారం అమెరికాలో ఇంట‌ర్నెట్ మూడు రెట్లు అదిక వేగంతో ప‌నిచేస్తుంది.

Japan Internet: ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో జ‌పాన్ సంచ‌ల‌నం


జ‌పాన్ ఎన్ఐసీటీతో క‌లిసి ప‌నిచేస్తున్న ఫోటోనిక్ నెట్వ‌ర్క్ ల్యాబ్ టీమ్‌తో పాటు సుమితోమా ఎల‌క్ట్రిక్‌, యురోపియ‌న్ పార్ట్న‌ర్స్ కొత్త త‌ర‌హా టెక్నాల‌జీని రూపొందించారు. ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన నెట్వ‌ర్క్‌గా భావిస్తున్నారు. సుమారు 1808 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ల‌క్ష్యానికి డేటాను కేవ‌లం సెక‌నులో పంపిస్తున్నారు. 19 కోర్స్ ఉన్న స్పెష‌ల్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది.

రికార్డు బ్రేకింగ్

కొత్త ఇంట‌ర్నెట్ స్పీడ్‌తో జ‌పాన్‌ (Japan Internet)లో .. ఇంగ్లీష్ వికీపిడియాను 10వేల సార్లు కేవ‌లం ఒక్క సెక‌నులోనే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇంగ్లీష్ వికీపిడియాసుమారు 100 జీబీ స్పేస్ వాడుతుంది. కావాల‌నుకుంటే 8కే వీడియోల‌ను కేవ‌లం సెక‌నులో మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్ కోసం వాడే ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్‌ను సుమిటోమో ఎల‌క్ట్రిక్ సంస్థ డిజైన్ చేసింది. ఎన్ఐసీటీ దానికి కావాల్ఇస‌న ట్రాన్స్‌మిష‌న్ సిస్ట‌మ్‌ణు నిర్మించింది. ప్ర‌తి 86.1 కిలోమీట‌రు దూరానికి ట్రాన్స్‌మిట‌ర్లు, సిరీవ‌ర్లు, 19 లూపింగ్ స‌ర్క్యూట్‌లను ఎన్ఐసీటీ ప‌రిశోధ‌కులు వాడారు. ఈ లూప్స్ ద్వారా సిగ్న‌ల్స్ 21 సార్లు పాస్ అయ్యాయి. మొత్తం 1808 కిలోమీ దూరాన్ని .. రికార్డు బ్రేకింగ్ స్పీడ్‌తో 180 డేటా స్ట్రీమ్స్ తీసుకెళ్లిన‌ట్లు గుర్తించారు.

జపాన్లో ఏ తరం ఇంటర్నెట్ ఉంది?

5G నెట్‌వర్క్‌లు : ఆసియాలో 5Gని ముందుగా స్వీకరించిన దేశంగా జపాన్ ఉద్భవించింది, NTT డొకోమో, KDDI మరియు SoftBank అన్నీ మార్చి 2020లో వాణిజ్య 5G సేవలను ప్రారంభించాయి content.twimbit.com. కొత్తగా క్లౌడ్-స్థానిక 4G నెట్‌వర్క్‌ను నిర్మించిన రకుటెన్ మొబైల్, 2022లో దాని 5G సేవను ప్రారంభించింది

జపాన్లో 6 జి అందుబాటులో ఉందా?

6Gలో జపాన్ అగ్రగామి దేశంగా ఎదగాలని కోరుకుంటోంది. 5Gకి మించి (6G) అనేది 2030లలో ప్రవేశపెట్టబడే తదుపరి తరం సమాచార మరియు కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు మరియు ఇది అన్ని పారిశ్రామిక మరియు సామాజిక కార్యకలాపాలకు ఆధారం అవుతుందని భావిస్తున్నారు.

10g నెట్వర్క్ను ఉపయోగిస్తున్న దేశం ఏది?

ప్రపంచంలోని మొట్టమొదటి 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ చైనాలోని జియోంగాన్ న్యూ ఏరియా, హెబీ ప్రావిన్స్‌లో ప్రారంభించబడిందని స్థానిక ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: China: బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్ ప్రాజెక్టు – భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పు?

Breaking News Broadband High-speed internet innovation Internet Speed japan latest news Technology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.