📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Latest News: Japan – ఉద్యోగిని ఆత్మహత్య లో భారీ జరిమానా విధించిన కోర్టు

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌ (Japan) లో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి తన బాస్ పెట్టిన నిరంతర ఒత్తిడి, పనిస్థల వేధింపుల కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. మొదట ఈ ఒత్తిడి కారణంగా ఆమెకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత సెలవులు తీసుకుని ఇంటికెళ్లినా, మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.

అయితే ఆమె చనిపోవడానికి ముందే.. ఆ యువతి కుటుంబం.. సదరు సంస్థ పరిహారం చెల్లించాలని కేసు వేసింది. యువతి చనిపోవడానికి కారణం.. ఆ కంపెనీనే అని తేల్చిన కోర్టు.. భారీ ఫైన్ వేసింది. ఏకంగా ఆ యువతి కుటుంబ సభ్యులకు రూ.90 కోట్లు (Rs.90 Crore) చెల్లించడమే కాకుండా.. దీనంతటికీ కారణం అయిన ఆ కంపెనీ బాస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. జపాన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తీ వివరాలు

జపాన్‌లోని ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ ‘డి-యూపీ కార్పొరేషన్’ (‘D-UP Corporation’)లో సటోమి (25) అనే యువతి 2021 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరారు. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఒక మీటింగ్‌లో, ఆమె ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ మిత్సురు సకై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ముందే ఆమెను ‘వీధికుక్క’ అంటూ అవమానకరమైన పదజాలంతో దూషించారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.

Japan

ఈ ఘటన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయగా, కోమాలోకి వెళ్లారు. సుదీర్ఘ కాలం మృత్యువుతో పోరాడి 2023 అక్టోబర్‌లో ప్రాణాలు విడిచారు. తమ కుమార్తె మృతికి కారణమైన కంపెనీపై, ప్రెసిడెంట్‌పై ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటం ప్రారంభించారు.

సటోమి మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి

ఈ కేసుపై విచారణ జరిపిన టోక్యో జిల్లా కోర్టు, సటోమి మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి, ఆమె ఆత్మహత్యకు ప్రెసిడెంట్ మిత్సురు సకై వ్యాఖ్యలే కారణమని నిర్ధారించింది. దీనిని కార్యాలయంలో జరిగిన ప్రమాదంగా పరిగణించింది. కంపెనీ, ప్రెసిడెంట్‌ను బాధ్యులుగా చేస్తూ భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అంతేకాకుండా, మిత్సురు సకై వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సకై తన పదవికి రాజీనామా చేయగా, డి-యూపీ కార్పొరేషన్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ విధానాలను సమీక్షించుకుంటామని హామీ ఇచ్చింది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bcci-bcci-responds-to-handshake-controversy/international/547763/

Breaking News company boss pressure compensation 90 crore corporate accountability court orders resignation employee depression suicide japan workplace harassment case latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.