📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Telugu News: Japan- జపాన్ లో ఉన్న మోదీకి సుభాష్ చంద్రబోస్ కుమార్తె ఓ రిక్వెస్ట్

Author Icon By Hema
Updated: August 29, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉండగా ఆమె చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జర్మనీలో (Germany) నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్, ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తన వయసు పెరుగుతున్నందున ఈ సమస్యకు త్వరగా ముగింపు రావాలని కోరారు. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వస్తే, తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని తప్పక అడుగుతానని తెలిపారు.

గత ప్రభుత్వ ప్రయత్నాలపై అనితా స్పందన

అనితా బోస్ మాట్లాడుతూ, గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం నేతాజీ అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించిందని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగించాలని అభిలషించారు. ఇది కేవలం తన వ్యక్తిగత కోరిక కాదని, నేతాజీ దేశానికి చెందిన మహనీయుడు కావడంతో ఈ విషయంలో త్వరిత చర్య అవసరమని (necessary) ఆమె పేర్కొన్నారు.ఈ అంశాన్ని నేను నా కొడుక్కి బాధ్యతగా ఇవ్వదలచుకోను. నా జీవితకాలంలోనే దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను” అని అనితా బోస్ భావోద్వేగంగా పేర్కొన్నారు. నేతాజీ కేవలం తన తండ్రే కాక, మొత్తం దేశానికి చెందిన నాయకుడని ఆమె గుర్తు చేశారు.

Japan- జపాన్ లో ఉన్న మోదీకి సుభాష్ చంద్రబోస్ కుమార్తె ఓ రిక్వెస్ట్

నేతాజీ మరణం – చరిత్రలో నమోదు

1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ, అంతర్జాతీయ విచారణలు నిర్ధారించాయి. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆయన స్థానిక సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన అస్థికలు ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలో భద్రపరిచినట్లుగా విశ్వసిస్తున్నారు.

నేతాజీ అస్థికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి?
జపాన్‌లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలో ఒక కలశంలో భద్రపరిచినట్లు విశ్వసిస్తున్నారు.

అనితా బోస్ ఎవరూ?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్నారు.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-green-chili-health-benefits/health/537880/

AnitaBose Google News in Telugu JapanVisit Latest News in Telugu NarendraModi NetajiSubhashChandraBose RenkojiTemple Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.