మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కానీ ఈ ఏడాది ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షలాదిమంది మరణించారు. ఊహించని ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చాయి. ప్రజలు ఉప్పెనలా దుర్మరం చెందారు తాజాగా జపాన్ లోని గున్మా ప్రిఫెక్చర్ లోని మినాకామి పట్టణం సమీపంలో గల కన్-ఎత్సు ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. భారీగా మంచువల్ల ప్రమాదం (Accident) భారీగా మంచు కురుస్తుండడం రోడ్డుపై మంచుతో 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, 26మందికి గాయాలయ్యాయి.
Read also: America: కాల్పులు, ఉగ్రవాద బెదిరింపుల కేసులో భారత విద్యార్థి అరెస్టు
50 vehicles collided with each other
ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు
ప్రమాదం అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి 7:30 గంటల సమయంలో మొదట రెండు ట్రక్కులు ఢీకొన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత వెనుక వస్తున్న వాహనాలు బ్రేక్స్ వేయడంతో విఫలమవడంతో ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నట్టు చెబుతున్నారు. క్షణాల వ్యవధిలోనే సుమారు 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దాదాపు 17 వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఓ వృద్ధురాలు మృతి
ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. 26మంది గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. జపాన్ లో నూతన సంవత్సర సెలవులు ప్రారంభమైన వేళ, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దర్యాప్తు, భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే రహదారి ట్రాఫిక్ కు ఎప్పుడు అనుమతిస్తారనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: