📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Jakarta: ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం

Author Icon By Saritha
Updated: December 22, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలతో పాటు, ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం” మత్తులో వాహనాలను నడపడం వల్లే అధిక ప్రమాదాలకు కారణాలు. కారణాలు ఏవైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తుల మరణాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయి. తాజాగా ఇండోనేషియాలోని (Indonesia) జావా ప్రధాన ద్వీపంలో ఈ సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోట చేసుకుంది. (Jakarta) వేగంగా వెళ్తున్న ఒక ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి కాంక్రీట్ బారియర్ ను ఢీకొట్టి బోల్లా పడింది. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో కనీసం 16మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు.

Read Also: Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

A road accident in Indonesia claims 16 lives

నియంత్రణ కోల్పోయిన డ్రైవర్

Q స్థానిక అధికారులు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుడియోనో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంతరాష్ట్ర బస్సు రాజధాని జకర్తా నుంచి పురాతన రాజనగరం యోగ్యకర్తకు బయలుదేరింది. సోమవారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే మధ్య జావాలోని సెమరాంగ్ సిటీలో ఉన్న క్రాప్యాక్ టోల్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. (Jakarta) ముఖనయంగా ఒక మలుపువద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ బారియర్నుబలంగా ఢీకొట్టి పక్కకు బోల్లాపడింది. బయటికి ఎగిరిపడ్డ ప్రయాణీకులు ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువ ఉందంటే.. బస్సు బారియర్ ను ఢీకొట్టిన ధాటికి కొందరు ప్రయాణీకులు కిటికీల నుంచి బయటకు ఎగిరిపడ్డారు. మరికొందరు బస్సు బాడీమధ్యలో నలిగిపోయి లోపలే చిక్కుకుపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. ఆపై 40 నిమిషాల తర్వాత సహాయక బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బస్సులోంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. అక్కడిక్కడే మొత్తం ఆరుగురు చనిపోగా.. మిగతా పదిమంది ఆస్పత్రికి తరలించేటప్పుడు మరణించారు.

ఐదుగురు పరిస్థితి విషమం

ఈ ప్రమాదంలో గాయపడిన మరో 18 మందిని తక్షణమే సమీపంలోని రెండు ఆసుపత్రులకు తరలించారు. వీరిఓ ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరునుచూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెట్టింట వైరల్ అవుతుండగా.. చూసిన వారంతా షాక్ అవుతున్నారు. వీడియోలు హృదయవిదారకంగా ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా వాహనంలో సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:


Driver Loss of Control Fatal Road accident Indonesia Road Accident Java Bus Crash Search and Rescue Operation Telugu News Traffic Safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.