📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Taliban: తాలిబాన్‌ మంత్రితో జైశంకర్ చర్చలు

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబన్ల (Taliban) తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో అధికారికంగా ఫోన్‌లో మాట్లాడారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణ భారత్-ఆఫ్ఘన్ మధ్య తొలి మంత్రిత్వ స్థాయి చర్చ కావడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్‌ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులను చంపడంపై యావత్‌ ప్రపంచం స్పందించింది. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ఖంచడాన్ని మంత్రి జైశంకర్‌ (Jaishankar) స్వాగతించారు. ఈ విషయాన్ని మంత్రి జైశంకర్‌ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తాలిబన్‌తో తొలిసారి మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం గమనార్హం. తాలిబన్‌ ప్రభుత్వంలో ఫోన్ సంభాషణ తర్వాత జైశంకర్(Jaishankar).. తాత్కాలిక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఆయన ఖండించడం హర్షణీయం. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధి అవసరాలకు సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చించామని’ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.

Taliban: తాలిబాన్‌ మంత్రితో జైశంకర్ చర్చలు

పహల్గాం ఉగ్రదాడిపై తాలిబాన్ ఖండన – జైశంకర్ స్పందన
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సంఘటనలతో తాలిబన్లను ముడిపెడుతున్నారని ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. భారత్‌ ప్రయోగించిన ఓ క్షిపణి అఫ్గాన్‌ భూభాగంలో పడినట్లు పాక్‌ తప్పుడు ప్రచారం చేసింది. అయితే దీన్ని కాబూల్‌ ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రచారాల ద్వారా భారత్‌ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య అపనమ్మకాన్ని సృష్టించడానికి పాక్‌ చేసిన ప్రయత్నాలను ఆప్ఘన్‌ తిరస్కరించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తాలిబన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ కూడా వీరి ఫోన్‌ కాల్‌ అనంతరం ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. వైద్య సహాయం కోరే ఆఫ్ఘన్ ప్రజలకు మరిన్ని వీసాలు అందించాలని ఈ ఫోన్‌ కాల్‌లో జైశంకర్‌ను ముత్తాకి కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యం, భారత జైళ్లలో ఉన్న ఆఫ్ఘన్ ఖైదీలను విడుదల చేయడం, తిరిగి ఇవ్వడం, ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధి గురించి కూడా చర్చించినట్లు ఆయన ప్రస్తావించారు. ఇందులో ఇద్దరు మంత్రుల మధ్య చర్చించిన విషయాలు ప్రస్తావించారు.

Read Also: INDIA PAKISTAN: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారం

Breaking News in Telugu Google news Google News in Telugu Jaishankar talks Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news with Taliban minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.