📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Spain: ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదంపై విజయం: జైశంకర్

Author Icon By Vanipushpa
Updated: January 21, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలనేనని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar)తెలిపారు. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం సహించకూడదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రపంచ దేశాల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దిల్లీలో స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇరుదేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. ఉమ్మడి సవాళ్లపై దేశాలు పరస్పరం సహకరించడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ సహకారం మరింత అవసరం. భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు. ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు సహించకూడదు. టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలి.” అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.

Read Also: Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్

Spain: ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదంపై విజయం: జైశంకర్

భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు

అలాగే స్పెయిన్‌‌లోని కార్డోబాలో జనవరి 18న జరిగిన రైలు ప్రమాదంపైనా జైశంకర్ స్పందించారు. ఆ రైలు యాక్సిడెంట్‌లో మరణించిన 40 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలువాలని ఆకాక్షించారు. కాగా, పట్టాలు తప్పిన హైస్పీడ్‌ రైలును మరో హైస్పీడ్‌ రైలు ఢీకొనడంతో స్పెయిల్‌లో దుర్ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో 40 మంది చనిపోగా, మరో 150 మందికిపైగా గాయపడ్డారు. “భారత్, స్పెయిన్ స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి అని జైశంకర్ వెల్లడించారు.

ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సు కోసం ఉద్దేశించిన డ్యూయల్ ఇయర్‌కు సంబంధించిన లోగో భారత్, స్పెయిన్ ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ” అని అల్బరేస్ వెల్లడించారు. ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భారత్ వంటి విశ్వసనీయ దేశంతో స్పెయిన్ సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరమని అల్బరేస్ అభిప్రాయపడ్డారు. “ప్రపంచంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఈ సమయంలో అంతర్జాతీయ చట్టాన్ని విశ్వసించే, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను సమర్థించే భారత్ వంటి విశ్వసనీయ దేశంతో సంబంధాలను పెంపొందించుకోవడం స్పెయిన్‌కు చాలా ముఖ్యం. ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరితే ఒక సానుకూల సంకేతం అవుతుంది. స్పెయిన్, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థలు. ” అని అల్బరేస్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

counter-terrorism initiatives diplomatic efforts global cooperation against terrorism India Foreign Policy international security S. Jaishankar statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.