📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Jaish-e-Mohammed: జైషే మహమ్మద్ కు చదువుకున్న మహిళలే టార్గెట్

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ (JeM) తన వ్యూహాలను మరింత విస్తరించడానికి కొత్త, పథకాన్ని రూపకల్పన చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) దెబ్బకు ఎవరూ ఊహించని నష్టాన్ని చవిచూసింది. దాన్నిప్పుడు పూడ్చుకుని.. తమ ఉనికిని తిరిగి చాటుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

Keir Starmer: UNSC లో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై యూకే మద్దతు

ఇందులో భాగంగానే మసూద్ అజార్ (Masood Azhar) నేతృత్వంలోని ఈ సంస్థ.. తమ చరిత్రలో మొదటిసారిగా మహిళల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో మహిళలను సాయుధ, పోరాట మిషన్లలో పాల్గొనకుండా నిషేధించిన జైష్ సంస్థ.. ఇప్పుడు వ్యూహాత్మక మార్పును ప్రకటించింది.

“జమాత్-ఉల్-మొమినాత్” పేరుతో ఈ మహిళా విభాగాన్ని (Women’s section) ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీని కోసం పాకిస్థాన్‌ (Pakistan) లోని బహావల్‌పూర్‌లోని మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ కేంద్రంలో నియామకాలు ప్రారంభం అయ్యాయి.

పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 100 కిలో మీటర్ల లోపల

ఈ “జమాత్-ఉల్-మొమినాత్” విభాగాన్ని జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా విస్తరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే చదువుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు మదర్సాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో భారత బలగాలు పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 100 కిలో మీటర్ల లోపల ఉన్న జైషే ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే తీవ్రంగా నష్టపోయింది.

Jaish-e-Mohammed

తమ ఉనికిని చాటుకోవడానికి జైషే మహిళా బ్రిగేడ్

ఈక్రమంలోనే మళ్లీ తమ ఉనికిని చాటుకోవడానికి జైషే మహిళా బ్రిగేడ్ ను ప్రారంభించబోతుంది.అయితే ఈ మహిళా విభాగానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ (Sadia Azhar) నాయకత్వం వహించనున్నారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాలు మార్కజ్ సుభానల్లా వద్ద జైషే (Jaish-e-Mohammed) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో మరణించిన యూసుఫ్ అజార్ (Yousuf Azhar) భార్యే ఈ సాదియా అజార్.

ఉగ్రవాద కార్యకలాపాల్లో జైషే కూడా

ఈ ఉగ్రవాద సంస్థ.. తమ కమాండర్ల భార్యలను, అలాగే బహావల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్‌సెహ్రాలోని తమ కేంద్రాలలో చదువుకుంటున్న ఆర్థికంగా బలహీనమైన మహిళలను తమ విభాగంలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. సాధారణంగా జైషే మహ్మద్, లష్కరే తొయిబా (LeT) వంటి సంస్థలు మహిళలను పోరాట కార్యకలాపాలకు దూరంగా ఉంచేవి.

కానీ ఐసిస్, బోకో హరామ్, హమాస్, ఎల్‌టిటిఇ వంటి ఇతర ఉగ్రవాద సంస్థలు మహిళలను ఆత్మాహుతి దాడి దారులుగా ఉపయోగించిన చరిత్ర ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే.. భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద కార్యకలాపాల్లో జైషే కూడా మహిళా ఆత్మాహుతి దాడులను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

మసూద్ అజార్, అతని సోదరుడు తల్హా అల్-సైఫ్ సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు.. దీని ఫలితంగానే ప్రత్యేక మహిళా బ్రిగేడ్ ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Jaish-e-Mohammed latest news Pakistan-based terror group Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.