📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jag Ladki: ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jag Ladki: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధనంతో జగ్ లాడ్కి అనే మరో నౌక భారత్‌కు సురక్షితంగా తిరిగొచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన ఈ నౌకలో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఈ నౌకను పుజైరా పోర్టులో లోడ్ చేశారు. ‘జగ్ లాడ్కి’ మొత్తం పొడవు 274.19 మీటర్లు, వెడల్పు 50.04 మీటర్లుగా ఉంది.

Read Also: North Korea: 99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

Jag Ladki: Another ship with crude oil reaches India.. ‘Jag Ladki’

హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితంగా భారత్ కు

మార్చి 14న పుజైరాలోని ఆయిల్ టెర్నినల్‌పై ఇరాన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘జగ్ లాడ్కి’ అదే సమయంలో అక్కడ ఇంధనం నింపుకుంటోంది. ఇంధనం నింపుకున్న అనంతరం ఈ నౌక అక్కడి నుంచి బయలుదేరి సురక్షితంగా భారత్ చేరుకుంది. ముర్బన్ క్రూడ్‌తో నిండిన ఈ నౌక మూడు రోజుల ప్రయాణం అనంతరం గుజరాత్ తీరానికి చేరుకుంది.

ఇప్పటికే శివాలిక్, నందాదేవి నౌకలు హర్మూజ్ జలసంధిని గుండా ప్రయాణించి సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. ఈ నౌకలు ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకువచ్చాయి. సముద్రమార్గంలో జరిగే చమురు రవాణాలో ఐదవ వంతు హర్ముజ్ జలసంధి ద్వారా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

India crude oil Iran israel war Jag Laadki ship Latest News in Telugu Mundra port Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.