📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Jaffar Express : జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి‌..

Author Icon By Sudha
Updated: October 7, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Jaffar Express)ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడికి పాల్పడింది. సింధ్‌-బలూచిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో గల సుల్తాన్‌కోట్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేల్చింది. అదే సమయంలో క్వెట్టా వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Jaffar Express) రైలు ప్రమాదానికి గురైంది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనకు పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్ల బృందం బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ బాధ్యత వహించింది. ప్రమాద సమయంలో పాక్‌ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడు దాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించింది. మరోవైపు ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.

Jaffar Express : జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి‌..

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై (Jaffar Express)దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ సైనికులను హతమార్చారు. అనంతరం పాక్‌ ఆర్మీ ఆపరేషన్‌ చేపట్టి బందీలను విడిచిపెట్టింది. ఆ తర్వాత జూన్‌లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పాక్‌ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్‌ గ్రూప్‌ వరుస దాడులకు పాల్పడుతోంది.

జాఫర్ ఎక్స్ప్రెస్ ఏమైంది?

పేలుడు పదార్థాల పేలుడు కారణంగా రైలు ఇంధన ట్యాంక్ పేలి, అకస్మాత్తుగా ఆగిపోయి, నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి . క్వెట్టా నుండి దాదాపు 157 కిలోమీటర్లు (98 మైళ్ళు) మరియు సిబి నగరానికి పశ్చిమాన 21 కిలోమీటర్లు (13 మైళ్ళు) దూరంలో, BLA టన్నెల్ నంబర్ లోపల రైలును హైజాక్ చేసింది.

ఏ ఉపగ్రహ ఇంటర్నెట్ కంపెనీ పాకిస్తాన్లో తాత్కాలిక noc పొందింది?

పాకిస్తాన్‌లో పనిచేయడానికి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్‌లింక్‌కు తాత్కాలికంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేయబడిందని ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ దేశ శాసనసభ్యులు గతంలో ‘గ్రూమింగ్ గ్యాంగ్‌ల’ వ్యాఖ్యలపై ఎలోన్ మస్క్ క్షమాపణతో అనుమతి పొందారని కూడా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

affar Express Breaking News latest news Pakistan trains Passenger Safety railway security Telugu News train attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.