ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) ఆగడాలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. తమపైకి ఇటుక విసిరాడనే సాకుతో 16 ఏళ్ల పాలస్తీనా బాలుడిని ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపారు. అయితే ఆ సమయంలో సదరు బాలుడు సైనికులపై ఎలాంటి దాడి చేయలేదని.. అతడి చేతిలో అసలు ఇటుకలే లేవని సీసీటీవి దృశ్యాలు బయటపడటంతో ఇజ్రాయెల్ సైన్యం ఆత్మరక్షణలో పడింది. ఉత్తర వెస్ట్ బ్యాంక్ పట్టణమైన ఖబాతీయలో శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన జరిగింది.
Read Also: US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం
ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం.
రాయన్ మహమ్మద్ అబు ముల్లా అనే 16 ఏళ్ల బాలుడు వీధి మలుపు తిరుగుతుండగా.. అక్కడ మాటు వేసిన సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ల గాయానికి బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తొలుత ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం.. “ఒక ఉగ్రవాది సైనికులపైకి భారీ ఇటుకను విసిరాడని, దానికి ప్రతిస్పందనగా జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు” అని ప్రకటించింది. ఓ వార్తా సంస్థ సేకరించిన సీసీటీవి దృశ్యాలు సైన్యం వాదన తప్పని తేల్చింది. ముఖ్యంగా కాల్పులు జరగడానికి సుమారు ఆరు నిమిషాల ముందు నుంచి ఆ వీధిలో ఏం జరిగిందనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది.
బాలుడు ఇటుకను వారిపైకి విసిరినట్లుగా కనిపించలేదు
బాలుడు వీధి చివర నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. అతడి చేతిలో ఇటుక కానీ రాయి కానీ ఏమీ లేవు. అలాగే అతడు దాన్ని వారిపైకి విసిరినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాకుండా అతడు మలుపు తిరిగిన మూడు సెకన్లలోనే సైనికులు కాల్పులు జరపడం వీడియోలో రికార్డు అయింది. ఈ ఆధారాలు బయటకు రావడంతో ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి స్పందిస్తూ.. “ఈ ఘటనపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నాం” అని మాట మార్చారు. తన కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని బాధితుడి తల్లి ఇప్తిహాల్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. “వాడు వాళ్లపైకి ఏమీ విసరలేదు.. ఒకవేళ ఏదైనా చేసి ఉన్నా కాళ్లపై కాల్చవచ్చు కదా? నేరుగా ప్రాణాలు తీస్తారా? నా కొడుకును గౌరవప్రదంగా పూడ్చిపెట్టుకోవాలని ఉంది. దయచేసి శవాన్ని అప్పగించండి” అంటూ చేసిన కామెంట్లు అక్కడున్న వారందరి చేత కంటతడి పెట్టించాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: