ఇజ్రాయెల్ (Israel) వ్యూహాత్మకంగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా నిర్వహించిన బాంబు దాడిలో ఇరాన్(Iran)కు చెందిన ముగ్గురు కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకారం, ఇది “ఆపరేషన్ రైజింగ్ లయన్”లో భాగమని వెల్లడించింది.ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలో బాంబు పేలుడు జరిగింది. పశ్చిమ ఇరాన్‌లో బెహ్నామ్ షాహ్‌రియారీ ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.బెహ్నామ్ షాహ్‌రియారీ ఖుద్స్ ఫోర్స్ ఆయుధ విభాగానికి కీలక కమాండర్. ఇతను హెజ్‌బుల్లా, హమాస్, హౌతీలకు ఆయుధాలు పంపించే ప్రధాన ప్రముఖుడిగా ఉన్నాడు. లెబనాన్, గాజా, యెమెన్ ప్రాంతాల్లో జరిగిన దాడుల వెనుక ఇతని పాత్ర ఉందని ఐడీఎఫ్ తెలిపింది.
ఇజాదీ – హమాస్ దాడికి పునాదులు వేసిన మరో కీలక నేత
ఇజ్రాయెల్ శనివారం ఉదయం జరిపిన మరో దాడిలో హెచ్. సయీద్ ఇజాదీ హతమయ్యాడు. ఇతను ఖుద్స్ ఫోర్స్‌కి చెందిన పాలస్తీనా డివిజన్‌ను నడిపించేవాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడికి కావలసిన ప్లానింగ్, వనరుల సరఫరా ఇతని హస్తకళగా భావిస్తున్నారు.అదే రోజున మరో కీలక కమాండర్ అమిన్ పౌర్ జోడకీ మరణించాడు. ఇతను ఐఆర్‌జీసీ సెకండ్ డ్రోన్ యూనిట్‌లో డిప్యూటీ కమాండర్‌గా ఉన్నాడు. శత్రు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు కీలకంగా వ్యవహరించిన నేతగా గుర్తింపు పొందాడు.
ఇజ్రాయెల్ దూకుడుతో ఇరాన్ బలగాలకు గట్టి దెబ్బ
ఈ వరుస దాడులతో ఇరాన్‌కు బలమైన మానవ నష్టాలు వాటిల్లాయి. ఇజ్రాయెల్ దూకుడుతో ప్రాక్సీ గ్రూపుల శక్తిని కట్టడి చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక IDF దాడులు అక్కడితో ఆగేలా కనిపించడం లేదు.
Read Also : Sonia Gandhi : కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ