📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Israel-Iran War: మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: March 18, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో యుద్ధం మునుపెన్నడూ లేనంతగా ముదిరింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్(Israel) ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ భద్రతా మండలి మాజీ కార్యదర్శి అలీ లారీజానీ, బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మరణించినట్లు సమాచారం. ఇది ఇరాన్ సైనిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

Israel-Iran War: Mojtaba will not be left anywhere: Israel warns

మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై ఉత్కంఠ

తన తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రచారం జరుగుతుండగా, క్రెమ్లిన్ మరియు ఇరాన్ రాయబార కార్యాలయం దీనిని ఖండించాయి. అయితే, “మొజ్తాబా ఎక్కడున్నా వెతికి పట్టుకుని అంతం చేస్తాం” అని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ మరియు క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్ పైనా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో పశ్చిమాసియా మొత్తం మంటల్లో చిక్కుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ali Larijani Death Israel Attack on Tehran Israel Iran War 2026 Middle East war news Mojtaba Khamenei Location Telugu News Paper Telugu News Today US Iran conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.