📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

News Telugu: Israel: ఇశ్రాయేల్-హమాస్ ల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు

Author Icon By Rajitha
Updated: October 7, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొంతకాలంగా బాంబుల వర్షంతో అట్టుడుకుతున్న గాజా యుద్ధం Gaza war ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump యుద్ధాన్ని ఆపడానికి ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశ అమల్లో భాగంగా సోమవారం హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి. కాగా శాంతి చర్చలకు హమాస్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహిస్తుండగా, ఇజ్రాయెల్ Israel నెతన్యాహు సన్నిహితుడు రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైదీల విడుదలపై చర్చలు శాంతి చర్చల్లో భాగంగా తొలుత కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల పాక్షిక ఉపసంహరణ, బందీలు, పాలస్తీనా ఖైదీల విడుదల అంశాలపై ముందుగా చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడే అవకాశం

Israel

ట్రంప్ అల్లుడు

కాగా ఈ శాంతి చర్చలు ఎర్రసముద్ర తీరంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్టులో ప్రారంభమైనట్లు ఈజిప్టుకు చెందిన అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా ఆయా దేశాల ప్రతినిధులతో పాటు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాలస్తీనియన్లకు సంఘీభావంగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ నాయకత్వంలో గాజా తీరానికి పడవల ద్వారా వచ్చి అరెస్టైన 171 మంది ఆందోళనకారులను ఇజ్రాయెల్ వదిలివేసింది.

వారు తిరిగి వారు వారి స్వదేశాలకు చేరుకున్నారు. సానుకూలంగా స్పందించిన హమాస్ యుద్ధ విరమణకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా హమాస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంపై నెతన్యాహు నిరాశ వ్యక్తం చేయగా ‘నువ్వు ఎందుకింత దారుణమైన నెగెటివిటీని కలిగి ఉంటావో అర్థం కావడం లేదు. ఇదొక విజయం. దీన్ని స్వాగతించు’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హమాస్, అరబ్, ఇతర ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్ చర్చలకు అంగీకరించడం సానుకూల అంశంగా ట్రంప్ అభివర్ణించారు.

గాజా యుద్ధానికి శాంతి చర్చలు ఎక్కడ ప్రారంభమైనాయి?
ఈచర్చలు ఈజిప్టులోని ఎర్రసముద్ర తీరంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్టులో ప్రారంభమయ్యాయి.

ఈ శాంతి చర్చలకు మధ్యవర్తులుగా ఎవరు వ్యవహరిస్తున్నారు?
అమెరికా, ఈజిప్టు, మరియు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Ceasefire Gaza Hamas israel latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.