📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Israel Lebanon Conflict: బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!

Author Icon By Tejaswini Y
Updated: March 4, 2026 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Israel Lebanon Conflict: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న లెబనాన్‌కు ఐడీఎఫ్ (IDF) గట్టి బుద్ధి చెబుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ట్యాంకులు, సైనిక బలగాలను ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించి, లెబనాన్ భూభాగంలోకి దూసుకెళ్తోంది.

Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు

Israel Lebanon Conflict: Fierce attacks in Beirut.. 16 villages warned to evacuate!

మృత్యుఘోష.. 16 గ్రామాలకు అల్టిమేటం

ఇజ్రాయెల్ వైమానిక మరియు భూతల దాడుల ధాటికి లెబనాన్‌లో ఇప్పటికే భారీ ప్రాణనష్టం సంభవించింది. దాడులు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో, సుమారు 16 గ్రామాల్లోని ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఇది హిజ్బుల్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు చేస్తున్న ఆపరేషన్‌లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఖమేనీ హతం తర్వాత మారిన ముఖచిత్రం

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమవ్వడం పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ మద్దతు ఉన్న దేశాలు ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ తన శత్రు దేశాలపై కనికరం లేని దాడులతో విరుచుకుపడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Beirut Air Strikes Hezbollah Target Israel IDF Lebanon Invasion Israel Lebanon Conflict Israel Lebanon Conflict 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.