Ali Larijani: ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

Read Time:  1 min
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్
FONT SIZE
GET APP

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజాని(Ali Larijani)తోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

Read Also: Pakistan Attack: కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్


Ali Larijani: Israel assassinates Iranian security chief Ali Larijani and top commander Gholamreza
Ali Larijani: Israel assassinates Iranian security chief Ali Larijani and top commander Gholamreza

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు లారిజన్ వార్నింగ్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై ఇరాన్ గట్టిగా పోరాడుతోంది. ఈ పోరాటం వెనుక ఉన్నది మాత్రం ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజాని అని ఇజ్రాయెల్ విశ్వాసం. ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఇటీవల లారిజన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్‌ను అంతం చేస్తానన్నాడు. అయితే, ఆయనెవరో కూడా తనకు తెలియదని ట్రంప్ అన్నాడు. మరోవైపు ముస్లిం దేశాలు తమకు మద్దతుగా నిలవకపోవడంపై లారిజన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇరాన్ సైన్యాన్ని దాడుల్ని లారిజాని పర్యవేక్షిస్తు్న్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.