Israel Iran War: ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

Read Time:  1 min
Israel Iran War: 'యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం': ఇరాన్ సంచలన ప్రకటన
Israel Iran War: 'యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం': ఇరాన్ సంచలన ప్రకటన
FONT SIZE
GET APP

Israel Iran War: తమ భూభాగంపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ నిప్పులు చెరిగింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన సమయంలో గట్టి బుద్ధి చెబుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఈ పరిణామాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సమాజానికి కీలక సంకేతాలు పంపారు. ఈ హెచ్చరికలతో మధ్యప్రాచ్య (Middle East) ప్రాంతంలో యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Read Also: Iran: మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక
‘యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, మేం ముగింపు పలుకుతాం. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుంది’ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ యొక్క దృఢమైన వైఖరిని తెలియజేస్తున్నాయి, ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇరాన్ తన ప్రతిస్పందన ద్వారా ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపనుంది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్

స్పందించిన ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.. ఏకంగా ఖమేని కార్యాలయం దగ్గరలో క్షిపణి దాడి జరిగింది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, ఆఫీసు సమీపంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే దాడులకు ముందే ఖమేని బంకర్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నామన్నారు ట్రంప్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.