Israel Iran War: ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Read Time:  1 min
Israel Iran War: ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
FONT SIZE
GET APP
Israel Iran War: Israel lashes out at Iran again
Israel Iran War: Israel lashes out at Iran again

Israel Iran War: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ పోరు మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులకు పాల్పడింది. వరుస బాంబు పేలుళ్లతో టెహ్రాన్ నగరం దద్దరిల్లిపోయింది. ఈ దాడుల వల్ల పలు భవనాలు నేలమట్టమవ్వగా, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ దాడులను తామే చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అధికారికంగా ప్రకటించింది.

Read Also: Pak-Afghan War : పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

రంగంలోకి అమెరికా.. మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యం

అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా పాల్గొంది. ఇరాన్‌పై జరిగిన దాడిలో అమెరికా కూడా పాల్గొన్నట్లు ఓ అమెరికన్ అధికారి వెల్లడించారు. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం పౌరులను అప్రమత్తం చేసింది. అక్కడ కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్‌లోని స్కూళ్లు, కార్యాలయాలను మూసివేశారు. దీంతో టెల్‌ అవీవ్‌ సైరన్లు మోగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని వారాల్లోనే మళ్లీ ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.