Israel-Hezbollah War: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సెకనుకో తీరుగా మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఈ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న దాడులు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి. తాజాగా లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Also: Iran-Israel War : యుద్ధంలోకి హెజ్బొల్లా ఎంట్రీ
50 గ్రామాలకు ఖాళీ చేయాలని ఐడీఎఫ్ హెచ్చరిక
లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వెంటనే వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సోమవారం అధికారికంగా హెచ్చరించింది. హెజ్బొల్లా ఉగ్రవాదులు పౌర నివాసాలనే తమ సైనిక స్థావరాలుగా వాడుకుంటున్నారని, ఆ ప్రాంతాలపై దాడులు చేసే సమయంలో సామాన్యులకు ప్రాణనష్టం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ప్రజలు తమ గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
బీరుట్‌ను వణికించిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’
ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరుట్ నగరం ఈ స్థాయిలో కంపించిపోవడం ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది.ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపు.. ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడటంతో ఇజ్రాయెల్ ఈ తీవ్ర ప్రతిచర్యకు దిగింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: