Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం (IDF) గాజా నగరంపై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది.ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం డ్రోన్లు, బాంబులు ఉపయోగించి గాజాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో 32 మంది చనిపోయినట్లు సమాచారం, వీరిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నిఘా పరికరాలు హమాస్ భవనాల్లో ఉంచారని ఆరోపిస్తూ, ఆ భవనాలను ధ్వంసం చేస్తోంది. IDF ఇప్పటికే స్థానిక పౌరులకు గాజా నగరాన్ని ఖాళీ చేయమని హెచ్చరించింది, దాంతో 2,50,000 మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.
హూతీ దాడులు, కుటుంబ నష్టం మరియు హమాస్ ప్రతిస్పందన
హమాస్‌కు మద్దతుగా యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై హైపర్-సోనిక్ బాలిస్టిక్ క్షిపణి(Hyper-sonic ballistic missile) ప్రయోగించారు. ఐడీఎఫ్ ప్రకారం ఆ క్షిపణి విజయవంతంగా నిరోధించబడింది. గాజా నగరంలో ఉత్తర ప్రాంతంలో IDF దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మరణించారని వైద్య వర్గాలు తెలిపారు. హమాస్ ఈ దాడులను ఖండిస్తూ, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరానికి సమానం అని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు పేర్కొంది.
లెబనాన్‌లో ఆయుధాల అప్పగింపు మరియు ఇరుదరఫుల యుద్ధం
లెబనాన్‌లోని పాలస్తీనా(Palestine) శరణార్థులు ఐదు ట్రక్కుల్లో ఆయుధాలను దేశ సైన్యానికి అప్పగించారు. మే నెల నుంచి పాలస్తీనా శరణార్థులు సైన్యానికి ఆయుధాలు అప్పగిస్తూ వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్-హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు, 251 మంది బందీ అయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 64,231 మంది పాలస్తీనియన్లు మరణించగా, 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారు. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
హమాస్ నిఘా పరికరాలు మరియు సరిహద్దు సెక్యూరిటీ కారణంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నారు.
ఇప్పటివరకు గాజా యుద్ధంలో ఎంత మంది మృతిచెందారు?
గాజా ఆరోగ్య శాఖ ప్రకారం, ఇప్పటివరకు 64,231 మంది పాలస్తీనియన్లు మరణించారు.
Read hindi News: Hindi.vaartha.com
Read also: