హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్(Israel) ఈ ఏడాది భారీ పురోగతిని సాధించింది. ఈ రెండు మిలిటెంట్ గ్రూపుల మూలాలను కత్తిరించింది. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కమాండర్లు మొదలుకుని అనేకమందిని మట్టుబెట్టింది. 2023 అక్టోబర్ లో తమదేశంపై దాడికి దిగినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోగలిగింది. అదే సమయంలో శాంతి ఒప్పందాలను సైతం కుదుర్చుకోగలిగింది గానీ అవి పెద్దగా ఫలించినట్లు కనిపించలేదు. ఈ ఏడాది హమాస్ చీఫ్ కమాండర్ యాహ్యా సిన్వర్, ఆ తర్వాత అతని తమ్ముడు మహ్మద్ సిన్వర్ ను హతమార్చింది. ఈ ఏడాది మే 13వ తేదీన హమాస్ శిబిరాలపై నిర్వహించిన మిస్సైళ్ల దాడుల సందర్భంగా మహ్మద్ సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెట్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది అప్పట్లో. నాటి దాడుల్లో హతమైంది సిన్వరేనని నిర్ధారించుకుంది.
Read Also: America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన
గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించామని ఐడీఎఫ్ వివరించింది.
సీనియర్ నాయకులు, కమాండర్లు హతం
సిన్వర్ సోదరుల మృతితో హమాస్ కు దాదాపుగా నాయకత్వం లేకుండా పోయిందనుకున్నప్పటికీ.. ఆ తర్వాత పలువురు హమాస్ కు నాయకత్వాన్ని వహించారు. వారిని కూడా మట్టుబెడుతూ వచ్చింది ఐడీఎఫ్. యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు మహ్మద్. ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు సారథ్యాన్ని వహించాడు. సిన్వర్ తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా మరణించాడు నాటి దాడుల్లో. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు.
మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 67,806 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 1,70,066 మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు అల్ జజీరా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని మొదటి దశ కాల్పుల విరమణకు ఈ ఏడాది అక్టోబర్ లో హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు ఆగలేదు. ఈ ఏడాది ఇదే హైలెట్..!” మరో వైపు జూన్ 13న ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో భారీ వైమానిక దాడికి దిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: