📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Today News : Israel Gaza conflict – గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Israel Gaza conflict – గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపీ లేకుండా దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే గాజా సిటీ మొత్తం పాడైపోయింది. అక్కడి ప్రజలు ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ మళ్లీ గాజ-పై (Gaza) దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన దాడుల్లో సుమారుగా 47మంది పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడులు ఇంకా పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. గాజా వాసులకు మువాసీ శరణార్థి శిబిరంలో అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ అక్కడికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవచే అడ్రాయీ తెలిపారు.

పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండడంతో సైన్యంలో చేరేందుకు ఆదేశ యువత ఆసక్తి చూపడం లేదు. ఇజ్రాయెల్ లో ఉన్న ప్రతి యువకుడు పదేళ్లపాటు సైన్యంలో రిజర్విస్టుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అయితే గాజా యుద్ధం (War) రాజకీయ లక్ష్యాలను సాధించడానికి జరుగుతోందని, హమాస్ను నావనం చేయడానికి కాదని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు టెల్ అవీవ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది.

Israel Gaza conflict – గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి

తిండి, వైద్యం లేక అల్లాడుతున్న ప్రజలు

గాజా, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. నువ్వా నేనా అనేలా భీకర దాడుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకులు తమ ఇళ్లను కోల్పోయారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. తిండి, వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. పాలస్తీనా ప్రజల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మానవసాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆహారం కోసం నిరీక్షిస్తున్న వారిపై కూడా గతంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఆసుపత్రులపై దాడులకు పూనుకుంది. దీంతో గాజాలో ఆహార కొరత, మందుల కొరతతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదలు తిండికి నోచుకోలేక, మరణిస్తున్నారు.

ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
గాజా సిటీ దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయింది. తాజా దాడుల్లో 47 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, మందుల కొరత, ఆసుపత్రులపై దాడులు, నిరాశ్రయుల సంఖ్య పెరగడం వల్ల పరిస్థితి మరింత విషమంగా ఉంది.

ఇజ్రాయెల్‌లో యుద్ధానికి వ్యతిరేక నిరసనలు ఎందుకు పెరుగుతున్నాయి?
గాజాపై యుద్ధం హమాస్‌ను నిలువరించడానికే కాకుండా రాజకీయ లక్ష్యాలకు నడుస్తోందని భావించి యువత సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తున్నారు. టెల్ అవీవ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సవాలుగా మారింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/gst-andhra-pradesh-sets-new-record-in-gst-collections/andhra-pradesh/540488/

Breaking News Breaking News in Telugu Gaza attacks Gaza deaths Israel Gaza Conflict Israel News Latest News in Telugu Middle East crisis Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.